Ravi Teja: తమిళ్ బ్లాక్ బస్టర్ మూవీ రీమేక్ పై కన్నేసిన మాస్ మహారాజ్..

Ravi Teja: కోలీవుడ్ ప్రముఖ హీరో సింబు హీరోగా ఎస్ జె సూర్య విలన్ గా నటించిన సినిమా "మానాడు".

admin1
Updated on: 14 Jan 2022 3:00 PM IST
Ravi Teja to Headline Maanaadu Telugu Remake?
X

Ravi Teja: తమిళ్ బ్లాక్ బస్టర్ మూవీ రీమేక్ పై కన్నేసిన మాస్ మహారాజ్..

Ravi Teja: కోలీవుడ్ ప్రముఖ హీరో సింబు హీరోగా ఎస్ జె సూర్య విలన్ గా నటించిన సినిమా "మానాడు". సై ఫై యాక్షన్ థ్రిల్లర్ లాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాలో కళ్యాణి ప్రియదర్శన్ హీరోయిన్ గా నటించింది. వెంకట్ ప్రభు దర్శకత్వం వహించిన ఈ సినిమా నవంబర్ 25 న విడుదలై బాక్స్ ఆఫీసు వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. తాజాగా ఈ చిత్ర రీమేక్ రైట్స్ మరియు తెలుగు డబ్బింగ్ రైట్స్ ను ప్రముఖ నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడక్షన్స్ వారు కొనుక్కున్న సంగతి తెలిసిందే. అయితే ఈ మధ్యనే మాస్ మహారాజా రవితేజ ఈ సినిమాని చూశారట.

ఈ సినిమా రవితేజ కి చాలా బాగా నచ్చిందట. సినిమా కథ మరియు హీరో పాత్ర చాలా బాగా నచ్చి ఈ సినిమాని రీమేక్ చేయాలని రవితేజ అనుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే రవితేజ వెళ్లి సురేష్ బాబుతో కథ గురించి డిస్కస్ చేస్తున్నట్లు తెలుస్తోంది. చూస్తూ ఉంటే "మానాడు" సినిమా తెలుగు రీమేక్ లో రవితేజ హీరోగా నటించే లాగా కనిపిస్తున్నారు. ఇక మరో వైపు రవితేజ కిలాడి, రామారావు ఆన్ డ్యూటీ మరికొన్ని సినిమాలతో బిజీగా ఉన్నారు.

admin1

admin1

Next Story