Ravi Teja: రెండు నెలల్లో రెండు బ్లాక్ బస్టర్లు అందుకున్న రవితేజ

Ravi Teja: రెండు వరుస సూపర్ హిట్లతో మాస్ మహారాజా

Jyothi
Updated on: 17 Jan 2023 7:30 PM IST
Ravi Teja Received Two Blockbusters in Two Months
X

Ravi Teja: రెండు నెలల్లో రెండు బ్లాక్ బస్టర్లు అందుకున్న రవితేజ

Ravi Teja: గత కొంతకాలంగా మాస్ మహారాజా రవితేజ వరుస డిజాస్టర్ లతో సతమతమవుతున్న సంగతి తెలిసిందే. "క్రాక్" సినిమా తర్వాత వరుసగా రెండు డిజాస్టర్లు అందుకున్న రవితేజ ఈ మధ్యనే "ధమాకా" సినిమాతో మంచి హిట్ అందుకున్నారు. త్రినాధ రావు నక్కిన దర్శకత్వంలో వహించిన ఈ సినిమాలో శ్రీ లీల హీరోయిన్ గా నటించింది. నాన్ ధియేటర్ బిజినెస్ తోనే ఈ సినిమా అదిరిపోయే ప్రాఫిట్లను నిర్మాతలకు మరియు డిస్ట్రిబ్యూటర్లకు కూడా అందజేసింది.

ఇంకా ఈ సినిమా సక్సెస్ ను సెలబ్రేట్ చేసుకుంటున్నారు రవితేజ అభిమానులకు "వాల్తేరు వీరయ్య" సినిమాతో మరొక బస్టర్ లభించింది. మెగాస్టార్ చిరంజీవి హీరోగా కె ఎస్ రవీంద్ర అలియాస్ బాబి దర్శకత్వం వహించిన "వాల్తేరు వీరయ్య" సినిమా సంక్రాంతి సందర్భంగా విడుదలైన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో రవితేజ కీలక పాత్రలో కనిపించారు. కమిషనర్ పాత్రలో రవితేజ నటన ఈ సినిమాకి చాలా బాగా ప్లస్ అయింది.

చిరంజీవి మరియు రవితేజ కలిసి చాలా కాలం తర్వాత నటించడంతో ఇద్దరి స్క్రీన్ ప్రజెంట్ ఈ సినిమాని సూపర్ హిట్ గా నిలిపింది. "ధమాకా" సినిమాతోనే వంద కోట్ల క్లబ్లో చేరిన రవితేజ "వాల్తేరు వీరయ్య" సినిమాతో ఇప్పుడు మరొక 100 కోట్ల సినిమాని సాధించారు. కేవలం రెండు నెలల వ్యవధిలోనే రవితేజ రెండు 100 కోట్ల సినిమాలను అందుకొని అభిమానులకు సర్ప్రైజ్ ఇచ్చారు. ఇక రవితేజ చేతిలో కూడా ఇప్పుడు "టైగర్ నాగేశ్వరరావు" అనే ఒక ప్యాన్ ఇండియా సినిమా ఉంది. ఇలా వరుస సూపర్ హిట్ ల వల్ల ఈ సినిమాపై కూడా మంచి అంచనాలు నెలకొన్నాయి.

Jyothi

Jyothi

Next Story