Chiranjeevi - Ravi Teja: 21 యేళ్ల తర్వాత మళ్లీ ఆ హీరోతో మెగాస్టార్

* ఈ సినిమాకి ''వాల్తేర్ వీర్రాజు'' అనే ఒక ఆసక్తికరమైన టైటిల్ ను అనుకుంటున్నారు

admin1
Updated on: 29 Sept 2021 7:00 PM IST
After long Time Chiranjeevi Acting with Ravi Teja
X

చిరంజీవి - రవి తేజ(ఫోటో- ది హన్స్ ఇండియా)

Chiranjeevi - Ravi Teja: వరుస సినిమా షూటింగులతో బిజీగా ఉన్న మెగాస్టార్ చిరంజీవి త్వరలో "ఆచార్య" సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. మరోవైపు చిరు "వెంకీ మామ" ఫేమ్ డైరెక్టర్ కే ఎస్ రవీంద్ర అలియాస్ బాబి దర్శకత్వంలో ఒక సినిమా చేసేందుకు సిద్ధమైన సంగతి తెలిసిందే. ఈ సినిమాకి "వాల్తేర్ వీర్రాజు" అనే ఒక ఆసక్తికరమైన టైటిల్ ను అనుకుంటున్నారు.

ఈ సినిమా మొత్తం విశాఖపట్నం బ్యాక్ డ్రాప్ తో సాగుతుందట. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా షూటింగ్ త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది. అయితే ఈ సినిమా గురించి ఆసక్తికరమైన వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఈ సినిమాలో మాస్ మహారాజా రవితేజ ఒక కీలక పాత్ర పోషించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన మాత్రం ఇంకా వెలువడాల్సి ఉంది.

మరోవైపు మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన "అన్నయ్య" సినిమాలో రవితేజ చిరు తమ్ముడి పాత్రలో కనిపించారు. ఆ సినిమా 2000లో విడుదలై సూపర్ హిట్ అయింది. దాదాపు 21 సంవత్సరాల తర్వాత మళ్ళీ చిరంజీవి రవితేజ కలిసి చేస్తున్న సినిమా ఇది.

చిరంజీవి నటించిన "శంకర్ దాదా జిందాబాద్" సినిమాలో రవితేజ గెస్ట్ పాత్రలో కనిపించారు. దాదాపు 21 సంవత్సరాల తర్వాత మళ్ళీ రవితేజ చిరంజీవి ఒకే ఫ్రేమ్ లో కనిపించబోతున్నారు అనడంతో అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

అయితే దీని గురించిన అధికారిక ప్రకటన మాత్రం ఇంకా బయటికి రావాల్సి ఉంది. మరో వైపు ఈ మధ్యనే "క్రాక్" సినిమాతో సూపర్ హిట్ అందుకున్న రవితేజ ఇప్పుడు "ఖిలాడి" మరియు "రామారావు ఆన్ డ్యూటీ" సినిమాలతో బిజీగా ఉన్నారు.

admin1

admin1

Next Story