Chiranjeevi - Ravi Teja: మెగాస్టార్ సినిమాలో కనిపించనున్న మాస్ మహారాజా

* 21 ఏళ్ల తర్వాత చిరంజీవి తమ్ముడిగా రవితేజ

admin1
Updated on: 14 Nov 2021 6:09 PM IST
Ravi Teja Playing a Role in Chiranjeevi Upcoming Movie After 21 Years
X

21 ఏళ్ల తర్వాత చిరంజీవి తమ్ముడిగా రవితేజ

Chiranjeevi - Ravi Teja: ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమా ప్రాజెక్టులతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఒకవైపు కొరటాల శివ దర్శకత్వంలో "ఆచార్య" సినిమాతో బిజీగా ఉన్న మెగాస్టార్ మోహన్ రాజా దర్శకత్వంలో "గాడ్ ఫాదర్" అనే సినిమాలో నటించబోతున్నారు. మెహర్ రమేష్ దర్శకత్వంలో "భోళా శంకర్" సినిమాకి ఓకే చెప్పిన మెగాస్టార్ కే ఎస్ రవీంద్ర అలియాస్ బాబి దర్శకత్వంలో కూడా ఒక సినిమా చేయడానికి సైన్ చేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా బాబీ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా నటిస్తున్న సినిమాలో చిరు తమ్ముడు పాత్ర కోసం ముందుగా పవన్ కళ్యాణ్ ని అనుకున్నారట.

కానీ తాజా సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్ ని కాకుండా ఈ సినిమాలో చిరంజీవి తమ్ముడు పాత్ర కోసం మాస్ మహారాజా రవితేజని దర్శకనిర్మాతలు ఎంపిక చేశారని తెలుస్తోంది. దాదాపు 21 ఏళ్ల క్రితం 2000 లో "అన్నయ్య" సినిమాలో చిరంజీవి తమ్ముడు పాత్రలో రవితేజ అందరినీ అలరించిన సంగతి తెలిసిందే. ఇన్నేళ్ల తర్వాత చిరంజీవి తమ్ముడిగా రవితేజను చూడటానికి అభిమానులు అందరూ చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ వారు ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ సినిమా గురించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.

admin1

admin1

Next Story