Ravi Teja: ప్రభుత్వ అధికారిగా కనిపించనున్న రవితేజ

Ravi Teja New Movie With Sarath Mandava
x

రవితేజ (ఫైల్ ఇమేజ్)

Highlights

Ravi Teja: ఖిలాడీ సినిమాతో దూసుకొస్తున్న రవితేజ ఆ తర్వాత సినిమాలో ప్రభుత్వ అధికారిలా కనపడబోతున్నాడంట.

Ravi Teja: మాంచి రైజ్ లో ఉన్న మాస్ మహారాజా రవితేజ.. డిమాండ్ పెరగడంతో.. మంచి కేరెక్టర్స్ కోసం డిమాండ్ చేస్తున్నాడంట. ఒకటే రొటీన్ స్టయిల్ తో బోర్ కొట్టించకూడదని.. ఇక ఆ రోజులు పోయాయని ప్రతి సినిమాకు వెరైటీ చూపిస్తూనే ప్రేక్షకులు సినిమా చూస్తారని రవితేజ డైరెక్టర్లకు చాలా గట్టిగా చెబుతున్నాడంట. క్రాక్ తో బంపర్ హిట్ అందుకుని ఆ తర్వాత ఖిలాడీ సినిమాతో దూసుకొస్తున్న రవితేజ ఆ తర్వాత సినిమాలో ప్రభుత్వ అధికారిలా కనపడబోతున్నాడంట. ఈ విషయం తెలిసి ఫ్యాన్స్ ఫుల్లు ఖుష్ అయిపోతున్నారంట.

ఈ మధ్యన ఎక్కవగా పోలీసు క్యారెక్టర్‌లో కనిపిస్తూ సిల్వర్ స్క్రీన్‌ పై రచ్చ చేస్తున్న రవితేజ.. కాస్త రూటు మార్చారు. నిన్న గాక మొన్ననే పోతురాజు వీరశంకర్‌ అంటూ.. క్రాక్‌ పోలీస్‌గా అదరగొట్టిన ఈ మాస్‌ రాజా..ఇప్పుడు ఖాకి చొక్కాని పక్కన బెట్టనున్నారు. మిడిల్ క్లాస్‌లా మారిపోయి బుద్దిగా ఓ గవర్నమెంట్ జాబ్ చేసుకోనున్నారు. రవితేజ హీరోగా శరత్‌ మండవ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. ఎస్‌.ఎల్‌.వి.సినిమాస్‌ పతాకంపై సుధాకర్‌ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమా 1990ల నేపథ్యంలో సాగనుందట.ఇక ఈ సినిమాలో రవితేజ ఓ ప్రభుత్వ అధికారిగా, ఇప్పటివరకు చూడని లుక్‌లో కనిపిస్తారట. వాస్తవ సంఘటనల ఆధారంగా డైరెక్టర్‌ శరత్‌ ఈ సినిమా కథను సిద్దం చేశారట. అంతే సహజంగా తెరకెక్కించేదుకు అన్ని విదాలుగా ట్రై చేస్తున్నారని ఇండస్ట్రీలో టాక్‌.

ఇక ఈ సినిమాలో రవితేజ ఇద్దరు కథానాయికలతో ఆడిపాడనున్నారట. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ మూవీకి స్యామ్‌ సీఎస్‌ సంగీతం అందిస్తుండగా, సత్యన్‌ సూర్యన్‌ కెమెరా బాధ్యతలు నిర్వర్తించనున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories