Ravi Teja New Movie: 'అ!' డైరెక్టర్ తో రవితేజ?

Ravi Teja New Movie: మాస్ మహారాజ రవితేజ, గోపిచంద్ మలినేని కాంబోలో వచ్చిన 'క్రాక్' సినిమా విజయవంతం అయిన సంగతి తెలిసిందే.

Venkata Chari
Published on: 23 March 2021 5:06 PM IST
Ravi Teja New Movie
X

రవితేజ (ఫొటో ట్విట్టర్)

Ravi Teja New Movie: మాస్ మహారాజ రవితేజ, గోపిచంద్ మలినేని కాంబోలో వచ్చిన 'క్రాక్' సినిమా విజయవంతం అయిన సంగతి తెలిసిందే. ఈ విజయంతో అనేక ప్రాజెక్టులు చేతిలో ఉన్న కొంత ఊపిరి పీల్చుకున్నాడు. ప్రస్తుతం రవితేజ, రమేష్ వర్మ డైరెక్షన్ లో 'ఖిలాడి' చిత్రీకరణలో బిజీగా ఉన్నారు. ఈ సినిమా షూటింగ్ ఇటలీలో నిర్వహిస్తున్నారు.

అలాగే 'RT68' పేరుతో త్రినాధ రావు నక్కిన దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్నాడు. ఈసినిమాలో 'జాతి రత్నాలు' ఫేం ఫరియా అబ్దుల్లా హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే.

తాజాగా వెలుగులోకి వచ్చిన విషయం ఏంటంటే.. 'అ!' సినిమాతో టాలీవుడ్ లో సంచలనం క్రియోట్ చేసిన ప్రశాంత్ వర్మతో రవితేజ జతకట్టనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కల్కీ, జాంజీ రెడ్డి సినిమాలతో తన సత్తా చాటుకున్న ఈ డైరెక్టర్.. తన నెక్ట్ ప్రాజెక్టును రవితేజతో ప్లాన్ చేశాడని, కథను కూడా వినిపించాడని సమాచారం. అయితే, రవితేజ మాత్రం ఈ డైరెక్టర్ కి ఇంకా ఓకే చెప్పలేదని తెలుస్తోంది. ప్రశాంత్ వర్మతో రవితేజ పనిచేస్తారా? లేదా? అనేది చూడాలి.

ఇక మలయాళ హిట్ చిత్రం "డ్రైవింగ్ లైసెన్స్" రీమేక్‌లో రవితేజ నటించనున్న సంగతి తెలిసిందే. ఇందులో కోలీవుడ్ స్టార్ విజయ్ సేతుపతి కూడా నటించనున్నారు. వరుసగా సినిమాలు చేస్తున్న రవితేజ... ప్రశాంత్ వర్మ చిత్రం చేసేందుకు గ్యాప్ తీసుకునేలా ఉన్నట్లు తెలుస్తోంది.

సినిమాలతో పాటు హీరో రవితేజ నిర్మాణం రంగంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. అతని ప్రొడక్షన్ వివరాలు ఇంకా బయటకు రాలేదు. యంగ్ అండ్ టాంలెంట్ గల వారిని ఇండస్ట్రీకి పరిచయం చేసేలా ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ప్రొడక్షన్ హౌస్ కేవలం నటీనటులకే కాదు.. వెండితెరలో అన్ని రంగాల వారి కోసం పనిచేస్తుందని తెలుస్తోంది.

Venkata Chari

Venkata Chari

Next Story