Ravi Teja: సినిమాటోగ్రాఫర్ డైరెక్షన్లో రవితేజ

Ravi Teja: ఇప్పటికే సినిమాటోగ్రాఫర్ గా తమ కెరియర్లను మొదలుపెట్టి ఇప్పుడు స్టార్ డైరెక్టర్లుగా ఎదిగిన పలు ప్రముఖులు ఇండస్ట్రీలో ఉన్నారు.

Arun Chilukuri
Published on: 26 Aug 2022 2:47 PM IST
Ravi Teja Movie with Karthik Ghattamaneni
X

Ravi Teja: సినిమాటోగ్రాఫర్ డైరెక్షన్లో రవితేజ

Ravi Teja: ఇప్పటికే సినిమాటోగ్రాఫర్ గా తమ కెరియర్లను మొదలుపెట్టి ఇప్పుడు స్టార్ డైరెక్టర్లుగా ఎదిగిన పలు ప్రముఖులు ఇండస్ట్రీలో ఉన్నారు. "ప్రేమ ఇష్క్ కాదల్" అనే సినిమాతో సినిమాటోగ్రాఫర్ గా పరిచయమైన కార్తీక్ ఘట్టమనేని కూడా 2015లో "సూర్య వర్సెస్ సూర్య" సినిమాతో డైరెక్టర్ గా మారారు. నిఖిల్ హీరోగా ఒక సరికొత్త కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకి వచ్చిన కార్తీక్ ఘట్టమనేని ఈ సినిమాతో ప్రేక్షకులను బాగానే మెప్పించారు.

ఆ తర్వాత మళ్లీ ప్రేమమ్, ఎక్స్‌ప్రెస్ రాజా, నిన్ను కోరి, చిత్రలహరి, వంటి సూపర్ హిట్ సినిమాలకు సినిమాటోగ్రాఫర్ గా పనిచేసిన కార్తీక్ ఇప్పుడు మళ్లీ డైరెక్షన్లో తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. మాస్ మహారాజా రవితేజ హీరోగా కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో త్వరలోనే ఒక సినిమా పట్టాలెక్కబోతోంది. స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.

ఇక ఈ సినిమా షూటింగ్ చాలా వరకు విదేశాల్లోనే జరగబోతున్నట్లు సమాచారం. గతంలో రవితేజ హీరోగా నటించిన "డిస్కో రాజా" సినిమాకి కార్తీక్ ఘట్టమనేని సినిమాటోగ్రాఫర్ గా పనిచేశారు. ఇక తాజాగా రవితేజ నటిస్తున్న "ధమాకా" సినిమాకి కూడా కార్తీక్ సినిమాటోగ్రాఫర్ గా పని చేస్తున్నారు. డైరెక్టర్ గా మొదటి సినిమాతోనే ప్రేక్షకులను మెప్పించిన కార్తీక్ రవితేజ సినిమాతో కూడా బాగానే ఆకట్టుకుంటారని అభిమానులు అనుకుంటున్నారు. వరుస డిజాస్టర్ లతో ఉన్నారు రవితేజకు ఈ సినిమా ఎంతవరకు హిట్ ఇస్తుందో వేచి చూడాలి.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story