భారీ మొత్తానికి అమ్ముడైన రవితేజ సినిమా రైట్స్

Ravi Teja Movie Rights Sold for a Huge Amount
x

భారీ మొత్తానికి అమ్ముడైన రవితేజ సినిమా రైట్స్ 

Highlights

భారీ మొత్తానికి అమ్ముడైన రవితేజ సినిమా రైట్స్

Ravi Teja's Movie: వరుస డిజాస్టర్లతో సతమతమైన మాస్ మహారాజా రవితేజ ఈ మధ్యన ఎట్టకేలకు "క్రాక్" సినిమాతో మళ్లీ ఫామ్ లోకి వచ్చారు. ఈ మధ్యనే "ఖిలాడి" అనే సినిమాతో మరొక మంచి హిట్ అందుకున్న రవితేజ ఇప్పుడు "రామారావు ఆన్ డ్యూటీ" సినిమాతో బిజీగా ఉన్నారు. శరత్ మండవ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో "మజిలీ" ఫేమ్ బ్యూటీ దివ్యాంశ కౌశిక్ హీరోయిన్గా నటిస్తోంది. రజిషా విజయన్, నాజర్, పవిత్ర లోకేష్, నరేష్ తదితరులు ఈ సినిమాలో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా ఈ ఏడాది మార్చి 25న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

దాదాపు 8 ఏళ్ల తర్వాత నటుడు వేణు తొట్టెంపూడి ఈ సినిమాతో రీ ఎంట్రీ ఇస్తున్నారు. ఈ సినిమా లో వేణు ఒక సీరియస్ పాత్రలో కనిపించబోతున్నారు అని తెలుస్తోంది. తాజాగా విడుదల అయిన ఈ చిత్ర టీజర్ కి మంచి ఆదరణ లభించింది. తాజాగా ఈ సినిమా డిజిటల్ రైట్స్ కి సంబంధించిన ఓ ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ప్రముఖ డిజిటల్ ప్లాట్ ఫామ్ సోనీ లివ్ వారు ఈ సినిమా డిజిటల్ రైట్స్ ను భారీ అమౌంట్ కి కొనుక్కున్నట్టు తెలుస్తోంది. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ మరియు ఆర్ టి టీమ్ వర్క్స్ పతాకంపై సుధాకర్ ఈ సినిమా నిర్మిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories