భారీ మొత్తానికి అమ్ముడైన రవితేజ సినిమా రైట్స్

Ravi Teja Rights Achieved By Zee Network
x

జీ నెట్వర్క్ వారు సాధించిన రవి తేజ రైట్స్

Highlights

* భారీ మొత్తానికి అమ్ముడైన రవితేజ సినిమా రైట్స్

Ravi Teja: మాస్ మహారాజా రవితేజ ఈ మధ్య వరుస సూపర్ హిట్ల తో కెరీర్ లో ముందుకు దూసుకుపోతున్నారు. ఈ మధ్యనే ధమాకా సినిమాతో 100 కోట్ల కలెక్షన్లను అందుకున్న రవితేజ ఈ మధ్యనే మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన "వాల్తేరు వీరయ్య" సినిమాతో మరొక వంద కోట్లు సినిమాని తన ఖాతాలో వేసుకున్నారు. ఈ నేపథ్యంలో రవితేజ ఎలాగైనా హ్యాట్రిక్ కొడితే బాగుంటుందని అభిమానులు రవితేజ తదుపరి సినిమా పైన బాగా ఫోకస్ చేస్తున్నారు.

ఈ క్రమంలో రవితేజ నెక్స్ట్ సినిమా "రావణాసుర" పై అంచనాలు రోజురోజుకీ పెరుగుతూ వస్తున్నాయి. అయితే తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ఒక ఆసక్తికరమైన వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది. ఈ సినిమా కి మంచి క్రేజ్ ఏర్పడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా పోస్ట్ థియేట్రికల్ రైట్స్ భారీ మొత్తానికి అమ్ముడైనట్లు తెలుస్తోంది. ప్రముఖ డిజిటల్ ప్లాట్ ఫామ్ జి నెట్వర్క్ వారు ఈ సినిమా డిజిటల్ రైట్స్ ను సొంతం చేసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

ఇక జి 5 వారు డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ సొంతం చేసుకోగా జీ తెలుగు వారు సినిమా సాటిలైట్ రైట్స్ ను సాధించారు. సుధీర్ వర్మ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. అను ఇమ్మాన్యుయల్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. పూజిత పొన్నాడ, దక్ష నగర్కర్, ఫరియా అబ్దుల్లా మరియు మెగా ఆకాష్ కూడా ఈ సినిమాలో హీరోయిన్లుగా కనిపించానన్నారు. సుశాంత్ విలన్ గా నటిస్తుండగా, రావు రమేష్, మురళీ శర్మ, సంపత్ రాజ్, నితిన్ మెహతా తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. అభిషేక్ పిక్చర్స్ మరియు ఆర్టీ టీమ్‌వర్క్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకి హర్షవర్దన్ రామేశ్వర్ మరియు భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories