Ravi Teja Krack Trailer : ష్యూర్‌ షాట్‌.. నో డౌట్‌... క్రాక్ టైలర్ పేలిపోయింది

మాస్‌ మహారాజ్‌ రవితేజ హీరోగా గోపిచంద్‌ మలినేని దర్శకత్వంలో రూపొందుతున్న హ్యాట్రిక్‌ చిత్రం ‘క్రాక్‌’.

Samba Siva Rao
Published on: 1 Jan 2021 3:37 PM IST
Ravi Teja Krack Trailer : ష్యూర్‌ షాట్‌.. నో డౌట్‌... క్రాక్ టైలర్ పేలిపోయింది
X

మాస్‌ మహారాజ్‌ రవితేజ హీరోగా గోపిచంద్‌ మలినేని దర్శకత్వంలో రూపొందుతున్న హ్యాట్రిక్‌ చిత్రం 'క్రాక్‌'. ఈ చిత్రం సంక్రాంతి సందర్భంగా ఈనెల 9న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. కొత్త సంవత్సరం సందర్భంగా రజవితేజ అభిమానులకు గిఫ్ట్ అందించారు దర్శకుడు గోపిచంద్‌ వలినేని. 'క్రాక్‌' ట్రైలర్‌ని శుక్రవారం విడుదల చేసింది. ఈ మూవీలో రవితేజ పవర్‌ఫుల్ పోలీసాఫీసర్‌గా కనిపించనున్నాడు. శ్రుతీహాసన్ హీరోయిన్ గా నటించింది. పందెంకోడీ2, తెనాలిరామకృష్ణ వంటి చిత్రాల్లో విలన్ పాత్రలో ఆకట్టుకున్న వరలక్ష్మీ శరత్‌కుమార్ ఈ సినిమాలో అదే పాత్రతో కనిపించనుంది. ఎస్ఎస్ థమన్ సంగీతం అందించాడు.

ఇక ట్రైలర్ విషయానికి వస్తే విక్టరీ వెంకటేశ్‌ వాయిస్ ఓవర్ తో మొదలవుతోంది. 'చూశారా.. జేబులో ఉండాల్సిన నోటు.. చెట్టుకు ఉండాల్సిన కాయ.. గోడకు ఉండాల్సిన మేకు.. ఈ మూడు ముగ్గురు తోపుల్ని తొక్కి తాట తీశాయ్‌.. ఇక్కడ కామన్‌ పాయింట్‌ ఏంటంటే.. ఈ ముగ్గురితో ఆడుకుంది ఒకే ఒక పోలీసోడూ..' అంటూ వెంకటేశ్ పలికిన మాటలు అదిరిపోయాయి. గతంలోనూ వెంకటేశ్ పలు చిత్రాలను వాయిస్ అందించారు. నితిన్ 'శ్రీనివాస కల్యాణం', అలాగే ఇంగ్లిష్‌ సినిమా 'అల్లావుద్దీన్‌' తెలుగు వెర్షన్‌లో వాయిస్‌ ఓవర్‌ ఇచ్చారు.

టైలర్ రవితేజ స్టైల్లో ఆకట్టుకునే విధంగా ఉంది. 'శంకర్‌... పోతరాజు వీరశంకర్‌ అంటూ రౌద్రంగా చెప్పె డైలాగ్.. ష్యూర్‌ షాట్‌.. నో డౌట్‌.. పుచ్చె పేలిపోద్ది అంటూ రవితేజ చెప్పిన మాస్‌ డైలాగ్స్‌ ఓ రేంజ్ లో ఉన్నాయి. సినిమా విడుదలను జనవరి 9న సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నామని చిత్ర బృందం వెల్లడించింది.


Samba Siva Rao

Samba Siva Rao

Next Story