Khiladi Title Song: డేంజర్ తో డేటింగ్ అంటూ "ఖిలాడి"గా వచ్చేసిన మాస్ మహారాజ్

* రవితేజ "ఖిలాడి" సినిమా టైటిల్ సాంగ్ విడుదల

Sandeep Reddy
Published on: 4 Nov 2021 2:59 PM IST
Khiladi Title Song: డేంజర్ తో డేటింగ్ అంటూ ఖిలాడిగా వచ్చేసిన మాస్ మహారాజ్
X

Khiladi Title Song Release: "క్రాక్" సినిమా సూపర్ హిట్ తో వరుస సినిమాలతో బిజీ ఉన్న రవితేజ తాజాగా రమేష్ వర్మ దర్శకత్వంలో "ఖిలాడి" చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. మాస్ రాజా రవితేజ సరసన మీనాక్షి చౌదరి, డింపుల్ హయతి హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ సాంగ్ ని ఆదిత్య మ్యూజిక్ విడుదల చేసింది.

"రాక్షసుడు" వంటి సూపర్ హిట్ చిత్రం తరువాత రమేష్ వర్మ దర్శకత్వం వహిస్తున్న సినిమా "ఖిలాడి" అవడంతో పాటు తాజాగా విడుదలైన టైటిల్ సాంగ్ లో రవితేజ లుక్ తో పాటు నిర్మాణ విలువలు రిచ్ గా ఉండటంతో పాటు దేవిశ్రీప్రసాద్ అందించిన సంగీతం ఆకట్టుకోవడంతో ఈ సినిమాపై అభిమానుల్లో అంచనాలు భారీగా పెరిగాయి.

జయంతిలాల్‌ గడ సమర్పణలో హ‌వీష్ ప్రొడ‌క్ష‌న్‌, పెన్ స్టూడియోస్ బ్యానర్‌పై రూపుదిద్దుకుంటున్న ఈ మూవీకి 'ప్లే స్మార్ట్' అనేది ట్యాగ్‌ లైన్‌. ఇక ఈ చిత్రంలో అనసూయ భరద్వాజ్, అర్జున్ కీలక పాత్రల్లో నటిస్తుండగా, దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.


Sandeep Reddy

Sandeep Reddy

Next Story