Ravi Teja: 'ఖిలాడీ' టీజర్.. డేంజరస్ గా కనిపిస్తున్న మాస్ మహారాజ్

Khiladi​​ Movie Teaser: మాస్ రాజా రవితేజ జోరు మీదున్నారు. సంక్రాంతికి క్రాక్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు.

Samba Siva Rao
Published on: 12 April 2021 11:57 AM IST
Ravi Teja Khiladi​​ Movie Teaser Released | Khiladi Telugu Movie Teaser
X

Ravi Teja Khiladi​​ Movie Teaser 

Khiladi​​ Movie Teaser: మాస్ మహారాజా రవితేజ జోరు మీదున్నారు. రవితేజ సంక్రాంతికి క్రాక్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. గోపిచంద్ మలినేని దర్శకత్వంలో వచ్చిన ఈ 'క్రాక్' సినిమాతో రవితేజకు పూర్వవైభవం వచ్చిందనే చెప్పొచ్చు. క్రాక్ లాంటి హిట్ మూవీ తర్వాత వరుస సినిమాలతో బీజీగా ఉన్నారు రవితేజ. ఈ సినిమా తర్వాత రవితేజ, నక్కిన త్రినాథ రావు సినిమాతో పాటు ఉగాది కానుకగా శరత్ మండవ అనే కొత్త దర్శకుడి చిత్రంలో నటించనున్నాడు. ఇంకోవైపు బోయపాటి శ్రీనుతో కాంబినేషన్లో మరో సినిమా ఉంటుందని సమాచారం.

అయితే తాజాగా రవితేజ హీరోగా రమేష్ వర్మ దర్శకత్వంలో 'ఖిలాడి' మూవీ చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ మూవీకి'ఖిలాడి'సంబంధించిన టీజర్ విడుదల చేసారు. ఉగాది కానుకగా ఒక రోజు ముందుగానే ఈ చిత్రం టీజర్ రిలీజ్ చేశారు. ఈ సినిమాలో రవితేజ జోడిగా డింపుల్ హయతితో పాటు మీనాక్షి చౌదురి హీరోయిన్స్‌గా నటించారు.

పెన్ మూవీస్ నిర్మిస్తున్న ఈ సినిమాలో యాంకర్ అనసూయ మరో కీలక పాత్రలో కనిపించనుంది. ఈ చిత్రంలో ఓ ప్రత్యేక గీతంలో అందాల తార ప్రణీత నర్తిస్తుందని సమాచారం. యాక్షన్ కింగ్ అర్జున్ మరో కీలక పాత్రలో కీలక పాత్ర పోషించారు. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.

ఈ టీజర్‌ విషయానికి వస్తే.. సస్పెన్స్ థ్రిల్లర్ జోనర్‌లో తెరకెక్కించినట్టు కనబడుతోంది. టీజర్ స్టార్టింగ్‌లో జైల్లో హీరో రవితేజను చూపించారు. ఈ సినిమాలో రవితేజ సైకో తరహా పాత్రలో కనిపించబోతున్నట్టు సమాచారం. హీరో సుత్తితో ఒక్కొక్కరి తలపై బాదుతూ ఉంటాడు. హీరో ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నాడు. అందుకు గల కారణాలు ఏమిటి? అనేది సినిమాలో చూడాలి. ఈ సినిమాలో నటించారు. ఈ చిత్రంలో రవితేజ డ్యూయల్ రోల్‌లో నటించాడా? ఒకడే ఇద్దరిగా ప్రవర్తించాడా అనేది ఆసక్తికరంగా ఉంది.


Samba Siva Rao

Samba Siva Rao

Next Story