Ravi Teja: ఖిలాడి ఓటీటీ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్..

Khiladi OTT Release Date: ఈ మధ్యనే "ఖిలాడి" సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం అరడజను పైగానే సినిమాలతో బిజీగా ఉన్నాడు.

Arun Chilukuri
Published on: 5 March 2022 7:49 PM IST
Ravi Teja Khiladi Movie OTT Release Date Confermed
X

Ravi Teja: ఖిలాడి ఓటీటీ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్..

Khiladi OTT Release Date: ఈ మధ్యనే "ఖిలాడి" సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం అరడజను పైగానే సినిమాలతో బిజీగా ఉన్నాడు. రమేష్ వర్మ దర్శకత్వం వహించిన ఖిలాడి సినిమా ఫిబ్రవరి 11న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయింది. డింపుల్ హయాతి మరియు మీనాక్షి చౌదరీలు ఈ సినిమాలో హీరోయిన్లుగా నటించారు. కోనేరు సత్యనారాయణ ఈ సినిమాని నిర్మించారు.

ఈ చిత్రం ఇప్పుడు సరిగ్గా నెల రోజుల తర్వాత ఓటీటీలో సందడి చేసేందుకు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ డిస్నీ+హాట్‌స్టార్‌ వేదికగా మార్చి 11వ తేదీ సాయంత్రం 6గంటల నుంచి స్ట్రీమింగ్‌ కానుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ డిస్నీ+హాట్‌స్టార్‌ ట్రైలర్‌ను విడుదల చేసింది. థియేటర్లలో యావరేజ్ గా నిలిచిన ఈ సినిమా ఓటీటీలో ఏ రేంజ్ లో సక్సెస్ సాధిస్తుందో చూడాలి. రవితేజ అభిమానులు మాత్రం మరోసారి ఈ సినిమాని ఓటీటీలో చూసేందుకు సిద్ధమైపోయారు.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story