Ravi Teja Khiladi: రవితేజ 'ఖిలాడి' ఫస్ట్ గ్లింప్స్ అదుర్స్

Ravi Teja Khiladi: రవితేజ ఖిలాడి ఫస్ట్ గ్లింప్స్ అదుర్స్
x

raviteja

Highlights

మాస్ మహరాజా రవితేజ ఈ ఏడాది ‘క్రాక్’ మూవీ హిట్ తో జోరు మీద ఉన్నారు.

మాస్ మహరాజా రవితేజ ఈ ఏడాది 'క్రాక్' మూవీ హిట్ తో జోరు మీద ఉన్నారు. ఈ నేపథ్యంలో వరుస పెట్టి సినిమాలు చేసుకుంటు వెళ్తున్నారు. కరోనా లాక్ డౌన్ తర్వాత థియేటర్స్ తెరచుకోవడంతో.. సగం ఆక్యుపెన్షీతో ఆడియన్స్ థియేటర్స్‌కు వస్తారా రారా? అనే సందేహాలకు పటాపంచలు చేస్తూ.. ఈ సినిమా కలెక్షన్స్ విషయంలో అదరగొట్టింది. కాగా.. రవితేజ ప్రధానపాత్రలో రమేష్ వర్మ దర్శకత్వంలో 'ఖిలాడీ' అనే మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రవితేజ పుట్టిన రోజు సందర్భంగా ఈ మూవీకి చెందిన గ్లింప్స్ విడుదల చేశారు.

'ఖిలాడి' పేరుతోనే మరరోసారి రవితేజ..తనదైన మాస్ యాక్షన్ ఎంటర్టేనర్‌తో ఆడియన్స్ ముందుకు రాబోతున్నాడు. దర్శకుడు రమేష్ వర్మ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న యాక్షన్ డ్రామా ఖిలాడి. మీనాక్షి చౌదరి, డింపుల్ హయతి నాయికలుగా నటిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ ని కోనేరు సత్యనారాయణ నిర్మిస్తున్నారు. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ బాణీలు కట్టాడు.

మరోవైపు ప్రణీత ఈ చిత్రంలో ప్రత్యేక గీతంలో నర్తించనుందని సమాచారం. ఈసైకో థ్రిల్లర్ల్‌ని అంతే గ్రిప్పింగ్‌గా రీమేక్ చేసిన దర్శకుడు రమేష్ వర్మ ఈ సినిమాకు దర్శకుడు. ఖిలాడీ చిత్రంలో మరోసారి రవితేజ ఆడియన్స్‌ను మెస్మరైజ్ చేయనున్నట్టు సమాచారం. ర‌వితేజ న‌టిస్తోన్న‌ 67వ సినిమా. ఇందులో ఆయ‌న ద్విపాత్రాభిన‌యం చేస్తున్నాడు. ఈ సినిమా డా.జయంతిలాల్‌ గడ సమర్పణలో హవీష్ ప్రొడక్షన్స్ , బాలీవుడ్‌కి చెందిన పెన్ స్టూడియోస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories