Ravi Teja: మరొకసారి గాయకుడిగా మారబోతున్న మాస్ మహారాజా

Ravi Teja: "ఖిలాడి" సినిమాలో పాట పాడబోతున్న రవితేజ

admin1
Updated on: 8 Dec 2021 7:01 PM IST
Ravi Teja is Going to Sing a Song in The Khiladi Movie
X

"ఖిలాడి" సినిమాలో పాట పాడబోతున్న రవితేజ (ఫైల్-ఫోటో)

Ravi Teja: వరుస డిజాస్టర్ తో సతమతం అయిన మాస్ మహారాజా రవితేజ తాజాగా ఈ ఏడాది మొదట్లో "క్రాక్" సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్నారు. ఇక పలు ఆసక్తికరమైన ప్రాజెక్టులతో బిజీగా ఉన్న రవితేజ "ఖిలాడీ" సినిమాతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో రవితేజ ఒక పాట కూడా పడబోతున్నారట. ఇది ఒక మాస్ పాట అని తెలుస్తోంది. దీని గురించి మాట్లాడుతూ చిత్ర దర్శకుడు రమేష్ వర్మ తన ఈ పాటకోసం రవితేజనే సింగర్ గా పెడితే బాగుంటుందని అనుకున్నట్లు, ఈ సినిమాకి సంగీతం అందిస్తున్న దేవి శ్రీ ప్రసాద్ కూడా దానికి ఒప్పుకున్నట్లు తెలిపారు.

"రవితేజ రా మరియు ఫంకీ వాయస్ ఈ పాటకి సరైన ఎలివేషన్ ఇస్తుందని అనిపించింది. నేను దేవి శ్రీ ప్రసాద్ ఈ ఐడియా ని రవితేజ తో చెప్పగానే వెంటనే ఒప్పుకున్నారు" అని అన్నారు రమేష్. మరికొందరు ఇతర సింగర్స్ తో పాటు హైదరాబాద్లోని ఒక స్టూడియోలో ఈ పాట షూటింగ్ త్వరలో జరగబోతోంది. సినిమా సెకండ్ హాఫ్ లో ఈ పాట వస్తుందని తెలుస్తోంది. ఇంతకుముందు "డిస్కో రాజా" సినిమా లో కూడా రవితేజ "రం పం బం" పాట పాడారు. "పవర్" లో "నోటంకి నోటంకి", మరియు "బలుపు" సినిమాలో "కాజలు చెల్లివా" పాట కూడా రవితేజ పాడారు.

admin1

admin1

Next Story