పూజా హెగ్డే ను ఫాలో అవుతున్న రవితేజ హీరోయిన్లు

Ravi Teja heroines following Pooja Hegde
x

పూజా హెగ్డే ను ఫాలో అవుతున్న రవితేజ హీరోయిన్లు

Highlights

Ravi Teja heroines: మాస్ మహారాజా రవితేజ ఈ మధ్యనే "క్రాక్" సినిమాతో సూపర్ హిట్ అందుకున్న సంగతి తెలిసిందే.

Ravi Teja heroines: మాస్ మహారాజా రవితేజ ఈ మధ్యనే "క్రాక్" సినిమాతో సూపర్ హిట్ అందుకున్న సంగతి తెలిసిందే. తాజాగా రవితేజ హీరోగా నటిస్తున్న ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. డింపుల్ హయాతి మరియు మీనాక్షి చౌదరి ఈ సినిమాలో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ మధ్యనే ఈ చిత్ర ట్రైలర్ ను విడుదల చేశారు దర్శక నిర్మాతలు. అయితే విజయవాడ అమ్మాయి డింపుల్ ట్రైలర్ లో బికినీతో తన అందాలను ఆరబోస్తూ అందరి దృష్టిని ఆకర్షించింది. మరోవైపు మీనాక్షి చౌదరి కూడా లిప్ లాక్ సన్నివేశాలు ప్రేక్షకుల దృష్టిలో పడుతోంది.

ఇక ట్రైలర్ చూస్తే వీరు ఒకరితో ఒకరు పోటీ పడుతూ మరి తమ అందాలను ఆరబోశారు. చూస్తూ ఉంటే ఈ ఇద్దరు హీరోయిన్లు పూజా హెగ్డే లాగా క్రేజ్ సంపాదించడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు అనిపిస్తోంది. అప్పటిదాకా పక్కింటమ్మాయి తరహా పాత్రలో కనిపించిన పూజాహెగ్డే ఒక్కసారిగా "డిజె" సినిమాలో తన గ్లామరస్ లుక్ లతో అందరినీ ఆకట్టుకుంది. ఆ సినిమా తర్వాత వరుసగా స్టార్ హీరోల సినిమాలు చేస్తూ పూజా హెగ్డే ఇప్పుడు స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. చూస్తూ ఉంటే డింపుల్ హయాతి మరియు మీనాక్షి చౌదరి కూడా పూజా హెగ్డే లాగానే తమ అందాలను చూపిస్తూ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్లు గా ఎదగాలని ప్రయత్నాలు చేస్తున్నట్లు అనిపిస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories