Ravi Teja: రైట‌ర్‌కి ఛాన్స్ ఇచ్చిన ర‌వితేజ‌?

Ravi Teja: ఈమధ్య కాలంలో రవితేజ పేరు మీద "క్రాక్" తప్ప పెద్దగా చెప్పుకోదగ్గ సినిమాలు లేవు.

Arun Chilukuri
Published on: 6 Aug 2022 3:09 PM IST
Ravi Teja Giving Direction Chance to Srikanth Vissa
X

Ravi Teja: రైట‌ర్‌కి ఛాన్స్ ఇచ్చిన ర‌వితేజ‌?

Ravi Teja: ఈమధ్య కాలంలో రవితేజ పేరు మీద "క్రాక్" తప్ప పెద్దగా చెప్పుకోదగ్గ సినిమాలు లేవు. ఈ మధ్యనే రవితేజ హీరోగా నటించిన "రామారావు ఆన్ డ్యూటీ" సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద పెద్ద డిజాస్టర్ గా నిలిచింది. చాలావరకు రవితేజ సినిమాలకి శ్రీకాంత్ విస్సా రైటర్ గా పనిచేస్తున్నారు. ప్రస్తుతం రవితేజ చేస్తున్న అన్ని సినిమాలకు కూడా తానే రచయితగా వ్యవహరిస్తున్నారు.

శ్రీకాంత్ రైటింగ్ స్కిల్స్ రవితేజ ను బాగా ఆకట్టుకున్నాయి. అందుకే శ్రీకాంత్ రాసిన రెండు కథలను రవితేజ కొనేసి వాటిని సినిమాలుగా చేస్తున్నాడు. ఇప్పుడు శ్రీకాంత్ విస్సా చేతికి రవితేజ మెగా ఫోన్ కూడా అందివ్వబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. రవితేజ హీరోగా నటిస్తున్న సినిమాకి శ్రీకాంత్ విస్సా దర్శకత్వం వహించనున్నారట. ప్రస్తుతం రవితేజ చేతిలో చాలా పెద్ద లైనప్ ఉంది.

వరుసగా సినిమాలు చేయడంలో బిజీ కాబోతున్నాడు రవితేజ. అయినప్పటికీ శ్రీకాంత్ విస్సా దర్శకత్వంలో సినిమా చేసేందుకు రవితేజ సమయం కేటాయించనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలను తానే నిర్మించడానికి కూడా రవితేజ రెడీ అయినట్లు తెలుస్తోంది. ఇప్పటిదాకా ఎందరో రైటర్లు దర్శకలుగా మారారు కానీ రవితేజ ఎప్పుడు వారితో పని చేయలేదు. తాజాగా ఒక రైటర్ కి ఛాన్స్ ఇచ్చి దర్శకుడిగా మారుస్తున్నారు రవితేజ.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story