Ravi Teja: వరుస షూటింగులతో బిజీ అయిపోయిన రవితేజ

Ravi Teja: తగ్గేదే లేదు అంటూ షూటింగ్ లతో బిజీగా అయిన మాస్ మహారాజా

admin1
Updated on: 19 Nov 2021 5:48 PM IST
Ravi Teja Becomes Extremely Busy with Shootings
X

వరుస షూటింగ్ లతో బిజీ అయిపోయిన రవి తేజ (ఫైల్ ఇమెజ్)

Ravi Teja New Movie: ఈ ఏడాది మొదట్లోనే మాస్ మహారాజా రవితేజ "క్రాక్" అనే సినిమాతో పెద్ద బ్లాక్ బస్టర్ అందుకున్నారు. ఇక ఈ సినిమా తర్వాత రవితేజ దశ తిరిగిందని చెప్పుకోవాలి. వరుస షూటింగులతో బిజీ అయిపోయారు రవితేజ. ఈ నేపథ్యంలోనే రవితేజ వచ్చే ఏడాది ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు సినిమాలను విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట. రవితేజ హీరోగా నటించిన "ఖిలాడి" సినిమా వచ్చే ఏడాది ఫిబ్రవరిలో విడుదలకు సిద్ధం అవుతున్న సంగతి తెలిసిందే. యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రం సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి.

మరోవైపు శరత్ మండవ దర్శకత్వంలో రవితేజ "రామారావు ఆన్ డ్యూటీ" సినిమాలో నటించారు. ఈ రెండు సినిమాల షూటింగ్ ఇప్పటికే పూర్తయింది. "రామారావు ఆన్ డ్యూటీ" సినిమా వచ్చే ఏడాది సమ్మర్లో విడుదల కాబోతోంది. ఇక ప్రస్తుతం రవితేజ మరొక సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్నారు. "ధమాకా" అనే టైటిల్తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాకి దర్శకత్వం వహించారు.

ఈ సినిమాని వచ్చే ఏడాది దసరా లేదా దీపావళికి విడుదల చేయాలని దర్శకనిర్మాతలు నిర్ణయించుకున్నారు. అంతే కాకుండా రవితేజ నటిస్తున్న ఒక ప్యాన్ ఇండియన్ సినిమాలో కూడా నటిస్తున్నారు. ఆ సినిమా 2023 లో విడుదల కాబోతున్నట్లు తెలుస్తోంది.

admin1

admin1

Next Story