ఇక 'డిస్కో రాజా' అటకెక్కినట్లేనా?

ఇక డిస్కో రాజా అటకెక్కినట్లేనా?
x
Highlights

'టచ్ చేసి చూడు', 'నేలటికెట్', 'అమర్ అక్బర్ ఆంటోనీ' వంటి మూడు వరుస డిజాస్టర్లతో మాస్ మహారాజా రవితేజ మార్కెట్ డీలా పడిపోయిన సంగతి తెలిసిందే. ఇక రవితేజ...

'టచ్ చేసి చూడు', 'నేలటికెట్', 'అమర్ అక్బర్ ఆంటోనీ' వంటి మూడు వరుస డిజాస్టర్లతో మాస్ మహారాజా రవితేజ మార్కెట్ డీలా పడిపోయిన సంగతి తెలిసిందే. ఇక రవితేజ సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో నటించాల్సిన 'తెరి' రీమేక్ కూడా క్యాన్సిల్ అయింది. తాజాగా రవితేజ 'ఎక్కడికి పోతావు చిన్నవాడా' ఫేమ్ దర్శకుడు విఐ ఆనంద్ దర్శకత్వంలో 'డిస్కో రాజా' అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా బయటకు వచ్చింది కాని ఆ తరువాత గత కొంత కాలంగా ఈ సినిమా గురించిన ఒక్క అప్ డేట్ కూడా సోషల్ మీడియాలో వినిపించలేదు.

ఎస్ ఆర్ టీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై 'డిస్కోరాజా తెరకెక్కాల్సి ఉంది. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా కూడా ఆగిపోయిందని కొందరు అంటున్నారు. రవితేజ మార్కెట్ బాగా పడిపోవడంతో సినిమా బడ్జెట్ ని కూడా తగ్గించాలని నిర్మాతలు కోరారట. ఈ విషయమై దర్శకుడికి నిర్మాతలకు ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ఈ సినిమా ప్రస్తుతం అటకెక్కిందని వార్తలు బయటకు వస్తున్నాయి. అయితే మరికొందరు మాత్రం 'డిస్కో రాజా' సినిమా కథ సమంత నటిస్తున్న 'ఓ బేబీ' సినిమాకు దగ్గరగా ఉండటం వల్లనే ఈ సినిమాను క్యాన్సిల్ చేశారని అంటున్నారు. ఏదేమైనా రవితేజ అభిమానులు మాత్రం మాస్ మహారాజా తదుపరి సినిమా ఎప్పుడు ఉండబోతోందో అని కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories