Ravi Teja: రవితేజ సుధీర్ వర్మ సినిమా టైటిల్ ఇదేనా?

Ravi Teja: "రావణాసుర" అనే టైటిల్తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న రవితేజ

admin1
Updated on: 2 Nov 2021 9:45 PM IST
Ravi Teja And Sudheer Varmas Movie Titled As Ravanasura
X
రావణాసురుడు టైటిల్ తో రానున్న రవితేజ సినిమా (ఫైల్ ఇమెజ్)

Ravi Teja: ఈ మధ్యనే "క్రాక్" సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న మాస్ మహారాజా ఇప్పుడు చేతినిండా ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ఒకవైపు రమేష్ వర్మ దర్శకత్వంలో "ఖిలాడి" సినిమా లో నటిస్తున్న రవితేజ, శరత్ మండవ దర్శకత్వంలో "రామారావు ఆన్ డ్యూటీ" సినిమాలో కూడా నటిస్తున్నారు. త్రినాధ్ రావు నక్కిన దర్శకత్వంలో "ధమాకా" సినిమాకి సైన్ చేసిన రవితేజ తన 70వ చిత్రాన్ని సుధీర్వర్మ దర్శకత్వంలో చేయబోతున్నట్లు ప్రకటించారు. త్వరలోనే ఈ సినిమా టైటిల్ ని కూడా విడుదల చేయబోతున్నారు. అభిషేక్ నామా ఈ సినిమాని నిర్మిస్తున్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాకి "రావణాసురా" అనే టైటిల్ అనుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

ఇప్పటికే "హీరోస్ డోంట్ ఎక్సిస్ట్" అనే ట్యాగ్ లైన్ విడుదల చేసి అందరి దృష్టిని ఆకట్టుకున్నారు దర్శకనిర్మాతలు. ఇక ఈ సినిమాకి "రావణాసుర" అనే టైటిల్ ని ఫిక్స్ చేసి టైటిల్ తో పాటు ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ని కూడా దీపావళి సందర్భంగా నవంబర్ 4 న విడుదల చేయబోతున్నట్లు గా తెలుస్తోంది. ఇంతకు మునుపు ఎన్నడూ రవితేజ తన కెరియర్లో చేయనటువంటి మేక్ఓవర్, క్యారెక్టరైజేషన్ ఈసినిమాలో ఉండబోతుందట. ఈ నేపథ్యంలో ఇక ఈ సినిమాపై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి.

admin1

admin1

Next Story