Ravi Krishna: నవ్యస్వామితో ప్రేమ, పెళ్లి విషయమై క్లారిటీ ఇచ్చిన రవికృష్ణ.. తనొచ్చి ప్రపోజ్ చేస్తే?

Ravi Krishna- Navya Swamy: బుల్లితెర ముద్దుగుమ్మ నవ్య స్వామి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

Arun Chilukuri
Published on: 10 May 2023 3:47 PM IST
Ravi Krishna Interesting Comments On Relation With Navya Swamy
X

Ravi Krishna: నవ్యస్వామితో ప్రేమ, పెళ్లి విషయమై క్లారిటీ ఇచ్చిన రవికృష్ణ.. తనొచ్చి ప్రపోజ్ చేస్తే?

Ravi Krishna- Navya Swamy: బుల్లితెర ముద్దుగుమ్మ నవ్య స్వామి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన అందం, నటనతో బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాకుండా నా పేరు మీనాక్షి సీరియల్ తో తెలుగునాట విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకుంది. ఈ భామ తన సహనటుడు రవికృష్ణతో ప్రేమలో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. వీరికి హిట్ పెయిర్ గా క్రేజ్ రావడంతో టీవీ షోలకు జంటగానే హాజరు అయ్యారు. అంతేకాక, కలిసి వీడియోలు, ఫోటోషూట్స్ చేయడంతో ఇద్దరి మధ్యన సమ్ థింగ్ సమ్ థింగ్ ఉందని అందరికి ఒక స్ట్రాంగ్ ఫీలింగ్ పడిపోయింది.

సోషల్ మీడియాలో తెగ యాక్టివ్ గా ఉంటే నవ్య స్వామి...తనపై వస్తున్న ప్రేమ వార్తల్లో నిజం లేదని..రవికృష్ణ ఒక మంచి స్నేహితుడు మాత్రమే అని పలు ఇంటర్వ్యూల్లో సైతం క్లారిటీ ఇచ్చింది. అయితే రవికృష్ణ మాత్రం ఇందుకు భిన్నంగా స్పందించడం విశేషం. మెగా హీరోతో కలిసి రవికృష్ణ చేసిన విరూపాక్ష చిత్రం బాక్సాఫీస్ దగ్గర బంపర్ హిట్ కొట్టిన విషయం మనకు తెలిసిందే కదా..ఈ క్రమంలో రవికృష్ణను ఒక యూట్యూబ్ ఛానెల్ ఇంటర్వ్యూ చేసింది. ఇందులో భాగంగా నవ్యస్వామితో మీకు ఉన్న రిలేషన్ ఏంటని యాంకర్ అడగగా...రవికృష్ణ షాకింగ్ సమాధానం ఇచ్చాడు.

నవ్యస్వామితో ఓ సీరియల్ కారణంగానే పరిచయం ఏర్పడిందని...ఆ పరిచయం స్నేహంగా ఏర్పడిందని చెప్పుకొచ్చాడు. ఒక ఫ్రెండ్ గా నవ్య అంటే ఎంతో ఇష్టమని రవికృష్ణ చెప్పాడు. అయితే యాంకర్ అక్కడితో ఆగకుండా, నవ్య వచ్చి ప్రపోజ్ చేస్తే మీ సమాధానం ఏంటని అడగగా...వెంటనే రవికృష్ణ మరో ఆలోచన లేకుండా ఆలోచిస్తానని సమాధానం ఇచ్చాడు. రవికృష్ణ ఇచ్చిన ఈ సమాధానమే నెట్టింట వైరల్ గా మారింది. నవ్యతో ఉన్న రిలేషన్ పై రవి ఇండైరెక్ట్ గా హింట్ ఇచ్చాడంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఏదిఏమైనా, ఈ బుల్లితెర హిట్ పెయిర్..రియల్ లైఫ్ ఓ కూడా కలిసి ఏడడుగులు వేస్తుందేమో చూడాలి.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story