logo

మెగా హీరో సరసన ఛాన్స్ పట్టేసిన రష్మిక మందన్న..ఇంతకీ ఎవరో తెలుసా..

మెగా హీరో సరసన ఛాన్స్ పట్టేసిన రష్మిక మందన్న..ఇంతకీ ఎవరో తెలుసా..

అల్లు అర్జున్ ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దరకత్వం లో ఒక సినిమా ని మొదలు పెట్టనున్నాడు. అతి త్వరలో ఈ సినిమా షూటింగ్ సెట్స్ పై కి వెళ్లనుంది. ఎప్పటి నుంచో ఈ సినిమా పై న రూమర్స్ వినిపిస్తున్నా కానీ ఇప్పటికి అయితే ఈ సినిమా గురించి న ముఖ్య వివరాలను ఫిలిం యూనిట్ తెలియపరచలేదు. ఇది అటుంచితే నేడు అల్లు అర్జున్ పుట్టిన రోజు ని పురస్కరించుకొని మైత్రి మూవీ మేకర్స్ సుకుమార్ సినిమా అనౌన్స్ చేసింది. ఈ సినిమా త్రివిక్రమ్ సినిమా తర్వాత సెట్స్ పైకి వెళ్లనుంది. ఇది వరకే ఈ సినిమా గురించి వార్తలు వచ్చినా ప్రస్తుతం సినిమా కి సంబందించిన అధికారిక ప్రకటన వచ్చింది. సుకుమార్ ఒక ఆసక్తికరమైన కథ ని బన్నీ కోసం సెట్ చేసాడట. ఇక ఈ సినిమా లో హీరోయిన్ విషయానికి వస్తే, ఈ సినిమా లో అల్లు అర్జున్ సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటించనుంది. ఇప్పటికే మహేష్ బాబు తదుపరి చిత్రాన్ని కైవసం చేసుకున్న రష్మిక, ఇప్పుడు ఇక ఈ చిత్రం లో బన్నీ సరసన నటించి అగ్ర కథానాయికల లిస్ట్ లో చేరిపోతుంది అని చెప్పుకోవచ్చు.





లైవ్ టీవి

Share it
Top