మరోసారి అడ్డంగా దొరికేసిన విజయ్ దేవరకొండ- రష్మిక...

Rashmika Mandanna, Vijay Devarakonda New Year Celebrations at Maldives
x

మరోసారి అడ్డంగా దొరికేసిన విజయ్ దేవరకొండ- రష్మిక...

Highlights

మరోసారి అడ్డంగా దొరికేసిన విజయ్ దేవరకొండ- రష్మిక...

Rashmika Mandanna: టాలీవుడ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ మరియు నేషనల్ క్రష్ రష్మిక మందన్న కలిసి ఇప్పటికే రెండు సినిమాల్లో నటించారు. గీత గోవిందం సినిమా బ్లాక్ బస్టర్ అయినప్పటి నుంచి వీరిద్దరూ నిజజీవితంలో కూడా ప్రేమించుకుంటున్నారు అంటూ వార్తలు మొదలయ్యాయి. ఎప్పటికప్పుడు తాము కేవలం స్నేహితులం మాత్రమే అని వీరు చెబుతూనే ఉన్నప్పటికీ వీరి మధ్య ఏదో ఉందని అభిమానులు మాత్రం చెబుతూనే ఉంటారు.

ఎప్పటికప్పుడు కలిసి వెకేషన్ లోకి వెళ్లే ఈ జంట తాజాగా న్యూ ఇయర్ కి కూడా ఫారిన్ కి కలిసి వెళ్లి కొత్త సంవత్సర వేడుకలు జరుపుకున్నారు. దీంతో వీరు కేవలం స్నేహితులు మాత్రమే కాదు అంటూ పుకార్లు మళ్ళి జోరు అందుకున్నాయి. ఇద్దరూ వేరువేరుగా ఉన్న ఫోటోలను సైతం మెర్జ్ చేసి మరి సోషల్ మీడియాలో కొందరు వైరల్ చేస్తున్నారు. తాజాగా ఇప్పుడు ఒక వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.

ఈ వీడియోలో రష్మిక తన ఫాన్స్ తో సోషల్ మీడియాలో ఇంటరాక్ట్ అవుతూ కనిపించింది. అందులో విజయ్ దేవరకొండ వాయిస్ కూడా వినిపించింది అని కొందరు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. వీరిద్దరి గురించి ఎన్ని పుకార్లు వస్తున్నప్పటికీ ఇద్దరిలో ఒకరు కూడా దీనికి సంబంధించి క్లారిటీ ఇవ్వటం లేదు. ఇక సినిమాల పరంగా "పుష్ప 2" లో నటిస్తున్న రష్మిక మందన్న హిందీలో కూడా కొన్ని సినిమాలలో నటిస్తోంది. మరోవైపు విజయ్ దేవరకొండ శివనిర్వణ దర్శకత్వంలో సమంత హీరోయిన్గా "ఖుషీ" సినిమాతో బిజీగా ఉన్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories