Rashmika Mandanna: రైతుగా మారిన ఛలో బ్యూటీ

Rashmika Mandanna: రష్మిక మందన్నా.. టాలీవుడ్‌లో స్టార్‌ హీరోయిన్‌గా ఎదిగిన అతికొద్ది మందిలో ఒకరు.

Venkata Chari
Published on: 18 March 2021 5:49 PM IST
Rashmika Mandanna Turns Farmer Video Goes Viral
X

రష్మిక మందన్నా (ఫొలో ఇన్‌స్టాగ్రాం)

Viral Video: రష్మిక మందన్నా.. టాలీవుడ్‌లో స్టార్‌ హీరోయిన్‌గా ఎదిగిన అతికొద్ది మందిలో ఒకరు. ఛలో, గీతా గోవిందం, సరిలేరు నీకెవ్వరు లాంటి భారీ హిట‍్లను తన ఖాతాలో వేసుకుంది. తెలుగులోనే కాదు సౌత్ ఇండియన్ మూవీస్ లోనూ తన సత్తా చాటుకుంటుంది ముద్దుగుమ్మ. రష్మిక ప్రస్తుతం తెలుగులో అల్లు అర్జున్ సరసనగ 'పుష్ప' సినిమాలో నటిస్తోంది.

కాగా, త‌మిళంలో కార్తీ హీరోగా వస్తున్న 'సుల్తాన్' చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాను బ‌క్కియ‌రాజ్ క‌ణ్ణన్ డైరెక్షన్‌ చేస్తున్నారు. డ్రీమ్ వారియ‌ర్ పిక్చర్స్ బ్యాన‌ర్‌పై య‌స్‌.ఆర్‌. ప్రకాష్ బాబు, య‌స్‌.ఆర్‌. ప్రభు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ మూవీలో రష్మిక పల్లెటూరి యువతిగా సందడి చేయనుంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ వీడియోని తన ఇన్‌స్ట్రాగ్రామ్‌ అకౌంట్‌లో షేర్‌ చేసింది రష్మిక.

ఈ వీడియోలో రష్మిక దుక్కిదున్నే యంత్రంతో పొలం దున్నుతున్నట్లు కనిపిస్తుంది. బురదలోకి దిగి, రైతుగా మరి పొలం దున్నుతుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తుంది. అయితే, ఏప్రిల్ 2న 'సుల్తాన్'‌ విడుదల కానుంది.


Venkata Chari

Venkata Chari

Next Story