ముద్దు సీన్ పై రియాక్ట్ అయిన రష్మిక

ముద్దు సీన్ పై రియాక్ట్ అయిన రష్మిక
x
Highlights

'గీత గోవిందం' సినిమాలో కలిసి నటించిన విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న మళ్లీ 'డియర్ కామ్రేడ్' సినిమాలో కూడా కలిసి నటిస్తున్న సంగతి తెలిసిందే. భరత్ కమ్మ...

'గీత గోవిందం' సినిమాలో కలిసి నటించిన విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న మళ్లీ 'డియర్ కామ్రేడ్' సినిమాలో కూడా కలిసి నటిస్తున్న సంగతి తెలిసిందే. భరత్ కమ్మ దర్శకత్వం లో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్ర టీజర్ ఈ మధ్యనే విడుదల అయింది కానీ అనుకున్నంత రేంజ్ లో ప్రేక్షకుల నుంచి రెస్పాన్స్ ను అందుకోలేక పోయింది. దానికి కారణం చాలా మంది టీజర్లో చూపించిన ముద్దు సీన్ పై నెగిటివ్గా రియాక్ట్ అవడం. టీజర్ లో చూపించిన విజయ్, రష్మీక ల మధ్య లిప్ లాక్ సీన్ బోలెడంత క్రిటిసిజం మరియు నెగిటివిటీ ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో ఆ ముద్దు సీన్ పై రియాక్ట్ అయింది రష్మీక.

చిన్న టీజర్ చూసి ఇలా ఒక నిర్ణయానికి రావడం సరికాదని కథ డిమాండ్ చేయనిదే తాను ఏది చేయనని, సినిమా విడుదలయ్యాక అది చూసి అప్పుడు దాని గురించి మాట్లాడండి అందరు హీరోయిన్ ల లాగానే రష్మిక కూడా చెప్పుకొచ్చింది. ఒకవేళ నిజంగానే కథకు లిప్ లాక్ అవసరమైతే అది నేరుగా వెండితెరపైనే చూపించి ఉంటే బాగుండేది అని దానిని ప్రమోషన్ల కోసం వాడటం బాగా లేదని కొందరు పెదవి విరుస్తున్నారు. మొత్తానికి ఈ సినిమా చూసాకే ఈ లిప్ లాక్ సీన్ గురించి మాట్లాడగలం. సినిమా చూడాలంటే మే 31వ తేదీ వరకు ఆగాల్సిందే.

Show Full Article
Print Article
Next Story
More Stories