Jr NTR: ఎన్‌టీఆర్ తో జతకట్టనున్న రష్మిక మందన్నా

Rashmika Mandanna to Romance with Young Tiger NTR
x

ఎన్టీఆర్, రష్మిక మందన్నా (ఫొటో: ది హన్స్ ఇండియా)

Highlights

Jr NTR: ప్రస్తుతానికి టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్లలో రష్మిక మందన్నా ఒకరు. ఈ బ్యూటీ వరుస సినిమాలతో జోరుమీదుంది.

Jr NTR: ప్రస్తుతానికి టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్లలో రష్మిక మందన్నా ఒకరు. ఈ కన్నడ బ్యూటీ తెలుగులో వరుస సినిమాలతో జోరుమీదుంది. ఈ మధ్యే 'మిషన్ మజ్ను' తో బాలీవుడ్ కి ఎంట్రీ ఇవ్వబోతుంది గీతగోవిందం బ్యూటీ.

తాజాగా, యంగ్ టైగర్ ఎన్‌టీఆర్ రాబోయే సినిమాలో రష్మిక మందన్నా నటించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మేరకు నిర్మాతలు ఈ కన్నడ బ్యూటీ ని సంప్రదించినట్లు తెలుస్తోంది. కాగా, ఎన్‌టీఆర్ ప్రస్తుతం 'ఆర్‌ఆర్‌ఆర్' సినిమాతో బిజీగా ఉన్నారని తెలిసిందే. ఆ తరువాత త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తన తదుపరి సినిమా మొదలుపెట్టనున్నారు. త్రివిక్రమ్, ఎన్టీఆర్ కాంబోలో రష్మిక చేరుతుందో లేదో చూడాలి. ఇంకా దీనిపై అధికారికంగా ఎటువంటి ప్రకటన రాలేదు.

Show Full Article
Print Article
Next Story
More Stories