Rashmika Mandanna: "పుష్ప తర్వాత ఈ షూటింగ్ పిక్నిక్ లా గడిచింది" అంటున్న రష్మిక

Rashmika Mandanna: "పుష్ప తర్వాత ఈ షూటింగ్ పిక్నిక్ లా గడిచింది" అంటున్న రష్మిక

admin1
Updated on: 1 March 2022 6:00 PM IST
Rashmika Mandanna Tells You About Aadavallu Meeku Johaarlu Movie Shooting
X

Rashmika Mandanna: "పుష్ప తర్వాత ఈ షూటింగ్ పిక్నిక్ లా గడిచింది" అంటున్న రష్మిక

Rashmika Mandanna: వరుసగా స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూ బ్లాక్ బస్టర్ చిత్రాలను అందిస్తూ కెరీర్ లో ముందుకు దూసుకుపోతున్న రష్మిక మందన్న ఈ మధ్యనే "పుష్ప" సినిమాతో మరో బ్లాక్ బస్టర్ ను అందుకుంది. తాజాగా శర్వానంద్ హీరోగా నటిస్తున్న "ఆడవాళ్లు మీకు జోహార్లు" అనే సినిమాతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ఈ భామ. కిషోర్ తిరుమల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. సినిమా ప్రమోషన్స్ లో చిత్ర బృందం బిజీగా ఉంది. ఈ మధ్యనే విడుదలైన ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించింది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ రష్మిక ఈ సినిమా గురించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలు చెప్పుకొచ్చింది.

"మొదటి లాక్ డౌన్ సమయంలో కిషోర్ తిరుమల నాకు ఈ స్క్రిప్టుని వినిపించారు. నాకు చాలా బాగా నచ్చింది. ఇంటర్వెల్ సీన్ కి నేను షాక్ అయ్యాను. మిగతా కథ ఎలా ఉన్నా ఒక్క సన్నివేశం కోసం అయినా సినిమా చేయాలని అప్పుడే నిర్ణయించుకున్నాను. సినిమాలో నా పాత్ర పేరు ఆద్య. దాపరికాలు లేకుండా మనసులో ఏముందో అది బయటకు చెప్పెస్తు ఉంటుంది. పుష్ప సినిమా షూటింగ్ సమయంలో అడవుల్లో గడిపి గడిపి ఈ సినిమా షూటింగ్ చాలా పిక్నిక్ లా గడిచింది. రాధికా, కుష్బూ, ఊర్వశి వంటి సీనియర్ నటులతో నటించటం మర్చిపోలేని ఎక్స్పీరియన్స్. మేమంతా కలిసి శర్వా ని ఆటపట్టిస్తూ ఉండేవాళ్లం" అని చెప్పిన రష్మిక "ఆడవాళ్ళు మీకు జోహార్లు" వంటి సినిమాలు చాలా రేర్ గా వస్తాయని చెబుతోంది.

admin1

admin1

Next Story