Rashmika Mandanna: ఫిమేల్ సెంట్రిక్ సినిమా సైన్ చేసిన రష్మిక

Rashmika Mandanna: మొట్టమొదటిసారిగా అలాంటి సినిమాలో కనిపించబోతున్న రష్మిక మందన

admin1
Updated on: 10 Jan 2022 7:00 PM IST
Rashmika Mandanna Signed Female Centric Movie | Tollywood News Online
X

ఫిమేల్ సెంట్రిక్ సినిమా సైన్ చేసిన రష్మిక

Rashmika Mandanna: టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా మారిన కన్నడ బ్యూటీ రష్మిక మందన్న వరుస సూపర్ హిట్ సినిమాలతో కెరీర్ లో ముందుకు దూసుకుపోతున్న ఈమె ఈ మధ్యనే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన "పుష్ప" సినిమాతో మరో బ్లాక్బస్టర్ ని తన ఖాతాలో వేసుకుంది. మరోవైపు మిషన్ మజ్ను, గుడ్బై సినిమాలతో బాలీవుడ్లో సైతం తన సత్తా చాటడానికి సిద్ధంగా ఉన్న రష్మిక తాజాగా ఇప్పుడు ఒక ఫీమేల్ సెంట్రిక్ సినిమా సైన్ చేసినట్లు తెలుస్తోంది. "చి ల సౌ" సినిమా తో దర్శకుడిగా మారిన నటుడు రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహిస్తుండగా గీతా ఆర్ట్స్ బ్యానర్ పై బన్నీ వాసు నిర్మించనున్నట్లు తెలుస్తోంది.

తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా కథ మొత్తం రష్మిక పాత్ర చుట్టూనే తిరుగుతుందట. ఒక విభిన్న కాన్సెప్టుతో ఈ సినిమా కథ ఉండబోతోందని, 1995లో జరిగిన ఒక కథ ఆధారంగా ఈ సినిమా ఉంటుందని తెలుస్తోంది. భారతదేశంలో అప్పుడు ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నంగా ఉన్న సమయంలో భారత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు ఆర్థిక సంస్కరణలు చేపట్టి ఆర్థిక దేశ ఆర్థిక వ్యవస్థను నిలబెట్టారు. ఈ నేపథ్యంలోనే రాహుల్ ఒక కిరాణా కొట్టు వాడి కూతురు ఒక పెద్ద బిజినెస్ ఉమెన్ గా ఎలా ఎదిగింది అనే కథతో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్టు తెలుస్తోంది. వరుసగా స్టార్ హీరోలతో సినిమాలు చేస్తున్న రష్మిక నటిస్తున్న మొట్టమొదటి ఫిమేల్ సెంట్రిక్ సినిమా ఇది.

admin1

admin1

Next Story