Rashmika Mandanna: బాలీవుడ్ ఐకాన్ తో పనిచేసేందుకు ఎదురుచూస్తున్న: రష్మిక మందాన్న

Rashmika Mandanna: మిషన్ మజ్ను చిత్రంతో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది కన్నడ బ్యూటీ రష్మిక మందాన్న.

Venkata Chari
Published on: 4 April 2021 4:59 PM IST
Rashmika Mandanna says will learn a lot working with Amitabh Bachchan in Goodbye
X

రష్మిక మందాన్న (ఫొటో హన్స్ ఇండియా)

Rashmika Mandanna: మిషన్ మజ్ను చిత్రంతో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది కన్నడ బ్యూటీ రష్మిక మందాన్న. ఈ సినిమా సెట్స్ పై ఉండగానే మరో బాలీవుడ్ సినిమాకు సైన్ చేసింది ఈ బ్యూటీ. అదే గుడ్ బై సినిమా. ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్ తో స్కీన్ షేర్ చేసుకుంటుంది. ఈ సందర్భంగా రష్మిక మాట్లాడుతూ, తన కెరీర్ లో ఇంత త్వరగా బాలీవుడ్ ఐకాన్ తో కలిసి పనిచేసే అవకాశం వస్తుందని ఊహించలేదని పేర్కొంది.

"బచ్చన్ సర్ తో కలిసి పని చేస్తున్నందుకు నేను నిజంగా కృతజ్ఞురాలిని, నా కెరీర్‌లో ప్రారంభంలోనే నేను సర్ తో స్క్రీన్ పంచుకుంటానని ఎప్పుడూ అనుకోలేదు. షూటింగ్ ఎప్పుడు ప్రారంభిస్తారోనని ఆశగా ఎదురు చూస్తున్నాను. సర్ నుంచి చాలా నేర్చుకుంటాను, " అని భీష్మ బ్యూటీ తెలిపింది.

రష్మిక "మిషన్ మజ్ను" సినిమాలో సిద్ధార్థ్ మల్హోత్రాతో కలిసి నటించనున్నారు.

Venkata Chari

Venkata Chari

Next Story