Rashmika Mandanna: నా ఫెవరెట్‌ ఐపీఎల్ టీమ్‌ అదే

Rashmika Mandanna: 'ఈ సాలా కప్‌ నమ్‌దే' అంటూ రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్‌సీబీ) తన ఫెవరెట్‌ అని చెప్పారు రష్మిక

Samba Siva Rao
Published on: 1 May 2021 2:10 PM IST
Rashmika Mandanna Says RCB is my favorite Team
X

Rashmika Mandanna Instagram

Rashmika Mandanna: రష్మిక మందాన్న తన అందం, యాక్టింగ్‌తో అనతి కాలంలోనే టాలీవుడ్‌లో టాప్ స్టార్‌గా ఎదిగింది. చలో, గీత గోవిందం సినిమాలతో క్యూట్ ఎక్స్ ప్రెషన్స్‌తో రష్మిక ఆకట్టుకుంటుంది. దీంతో వరుసగా అగ్రహీరోలతో సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. మూవీస్ తో బిజీగా ఉన్నప్పటికీ తీరిక దొరికితే సోషల్ మీడియాలో అభిమానులకు పలకరిస్తారు. దీంతో ఆమె అభిమానులు ఫుల్ ఖుషీ అయ్యారు.

ఈ సందర్భంగా అభిమానులు రష్మిక మందాన్నను అనేక రకాల ప్రశ్నలు అడిగారు. రష్మీక అభిమానులు అడిగిన అన్ని ప్రశ్నలకు ఓపికగా జవాబు ఇచ్చారు. ఓ అభిమాని రష్మిక పాట పాడాలని కోరాడు. అయితే అందుకు ఆమె నిరాకరించింది. పాట పాడితే అందరూ పారిపోతారు...మిమ్మల్నీ దూరం చేసుకోవడం ఇష్టం లేదని చమత్కారంగా మాట్లాడింది. ఇక మరో అభిమాని మీ ఇళ్లు మొత్తం చూపించాలని కోరాడు. దీనికి కూడా రష్మిక ఓప్పుకో లేదు. ఈ ప్రశ్నకు రష్మిక బదులిస్తూ... ఇళ్లు క్లీన్ గా లేదు. అందుకే నేను చూపించను అని ఆన్సర్ ఇచ్చింది.

ఇక మరో అభిమని రష్మిక మందాన్న ను ఐపీఎల్‌లో మీ ఫెవరెట్‌ టీమ్‌ ఏది అని అడిగాడు. దానికి రష్మిక.. 'ఈ సాలా కప్‌ నమ్‌దే' అంటూ రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్‌సీబీ) తన ఫెవరెట్‌ అని చెప్పారు. దీంతో ఆర్‌సీబీ ఫాన్స్ తెగ సంబరపడిపోయారు. యూఏఈ వేదికగా గతేడాది జరిగిన ఐపీఎల్‌​ సీజన్‌కు ఆర్‌సీబీ 'ఈ సాలా కప్‌ నమ్‌దే' అనే స్లోగన్‌తో బరిలోకి దిగిన విషయం తెలిసిందే.

రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు ఇప్పటి వరకు ఐపీఎల్ టైటిల్ గెలవలేదు. అయితే ఆజట్టుకు మాత్రం ఫ్యాన్ ఫాలోయింగ్ పీక్స్ లో ఉంటుంది. ఇక ఏడాది యూఏఈలో జరిగిన ఐపీఎల్ 13 సీజన్‌లో ఫ్లేఆఫ్‌ వరకు వెళ్లి ఇంటి బాట పట్టింది. లీగ్ మ్యాచుల్లో అద్భుత ప్రదర్శన చేసిన కోహ్లీ సేన.. కీలకమైన ఫ్లేఆఫ్‌లో మాత్రం చేతులెత్తేసింది. ఐపీఎల్‌ 2021 సీజన్‌ను మాత్రం ఆర్‌సీబీ ఘనంగా ఆరంభించింది. ఇప్పటివరకు ఆడిన ఆరు మ్యాచ్‌ల్లో నాలుగు విజయాలు నమోదు చేసింది.

రష్మిక మందన్నా ఈ ఏడాది కార్తీ హీరోగా వచ్చిన తమిళ సినిమా సూల్తాన్ తో కోలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమా పెద్దగా ఆకట్టుకోలేక పోయింది. ఆ సినిమాలో పల్లెటూరి అమ్మాయిగా రష్మిక కనిపించింది. కన్నడ డబ్బింగ్ మూవీ పొగరులో కూడా తళుక్కున మెరిసింది. తెలుగులో బన్ని సరసన పు‌ష్ఫ మూవీలో నటిస్తుంది. శర్వానంద్ హీరోగా రానున్న ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమాలో కూడా చెస్తుంది.

Samba Siva Rao

Samba Siva Rao

Next Story