Rashmika Mandanna: సంవత్సరానికి 565 రోజులు కావాలి అంటున్న స్టార్ హీరోయిన్

* ఐదు భాషల్లో ఒక ప్యాన్ ఇండియన్ సినిమా మరియు ఒక హిందీ సినిమా చేయాలంటే తనకి కనీసం 565 రోజులైనా కావాలని నవ్వేశారు రష్మీక

admin1
Updated on: 9 Oct 2021 1:11 PM IST
Rashmika Mandanna Says in an Interview, I Need 565 Days to Act in all Five Languages at a Time in Movies
X

రష్మిక మందన్న (ఫోటో- ది హన్స్ ఇండియా )

Rashmika Mandanna: టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ల లో ఒకరి గా చలామణి అవుతున్న రష్మిక మందన్న నిజానికి ఒక కన్నడ అమ్మాయి. కన్నడలో "కిరిక్ పార్టీ" అనే సినిమాతో సూపర్ హిట్ అందుకున్న రష్మిక ఆ సినిమాలో హీరోగా నటించిన రక్షిత్ శెట్టి తో నిశ్చితార్థం కూడా చేసుకుంది కానీ కొన్ని కారణాల వల్ల వారిద్దరూ విడిపోయారు. ఇక "ఛలో" సినిమా తెలుగులో కూడా ఎంటర్ అయిన రష్మిక సూపర్ హిట్ సినిమాలతో స్టార్ హీరోయిన్ గా మారిపోయింది.

తెలుగులో హ్యాపెనింగ్ బ్యూటీగా పేరు తెచ్చుకున్న రష్మిక మందన్న ఈమధ్యనే "సుల్తాన్" సినిమాతో తమిళం లో కూడా అడుగుపెట్టింది. ఇక మరోవైపు బాలీవుడ్లో కూడా మిషన్ మజ్ను సినిమాతో ప్రేక్షకులను పలకరించబోతున్న రష్మిక ఏకంగా బాలీవుడ్ మెగాస్టార్ అమితాబచ్చన్ తదుపరి సినిమా లో కూడా కనిపించనుంది.

కానీ కన్నడలో మాత్రం రష్మిక సినిమా చూసి చాలా కాలం అయింది. తన మాతృభాష అయిన కన్నడలో సినిమాలు ఎందుకు చేయడం లేదు అని అడగగా, తెలుగు మరియు హిందీ సినిమాలు చేస్తూ అటు ఇటు తిరగటం లోనే చాలా సమయం గడిచిపోతోంది అని, మరోవైపు తాను ఒక తమిళ్ సినిమా కూడా చేయబోతోందని ఇలాంటి సమయంలో కన్నడ సినిమా చేయడం అంటే చాలా టైం పడుతుంది అని అన్నారు.

అంతేకాక సంవత్సరానికి ఉన్న 365 రోజులు తనకి సరిపోవటం లేదని, ఐదు భాషల్లో ఒక ప్యాన్ ఇండియన్ సినిమా మరియు ఒక హిందీ సినిమా చేయాలంటే తనకి కనీసం 565 రోజులైనా కావాలని నవ్వేశారు రష్మీక.

admin1

admin1

Next Story