Rashmika Mandana: అతన్నే పెళ్లి చేసుకుంటాను అంటున్న రష్మిక మందన్న

Rashmika Mandana: కన్నడ బ్యూటీ రష్మిక మందన్న ఇప్పుడు తెలుగులో స్టార్ హీరోయిన్ గా మారిన సంగతి తెలిసిందే.

admin1
Published on: 18 Feb 2022 3:01 PM IST
Rashmika Mandanna Says He Will Get Married
X

Rashmika Mandana: అతన్నే పెళ్లి చేసుకుంటాను అంటున్న రష్మిక మందన్న

Rashmika Mandanna: కన్నడ బ్యూటీ రష్మిక మందన్న ఇప్పుడు తెలుగులో స్టార్ హీరోయిన్ గా మారిన సంగతి తెలిసిందే. ఒకవైపు తెలుగులో మాత్రమే కాక మరో వైపు తమిళ్, హిందీ మరియు కన్నడ సినిమాలతో కూడా బిజీ గా ఉంది ఈ భామ. ప్రస్తుతం అందరు స్టార్ హీరోలతో వరుస సూపర్ హిట్ సినిమాలతో ముందుకు దూసుకుపోతున్న రష్మిక ఈ మధ్యనే ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పెళ్లి ప్రేమ గురించి చెప్పుకొచ్చింది. "ఛలో" సినిమా కి ముందు రష్మిక మందన్న కన్నడ హీరో రక్షిత్ శెట్టి ను ప్రేమించి అతనితో నిశ్చితార్థం కూడా చేసుకున్న సంగతి తెలిసిందే. కానీ వారిద్దరూ విడిపోయారు.

ఆ తర్వాత "గీత గోవిందం" సినిమా బ్లాక్ బస్టర్ అయినప్పటి నుంచి రష్మిక మందన్న మరియు విజయ్ దేవరకొండ పీకల్లోతు ప్రేమలో మునిగి తేలుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ "ఎవరితో అయితే మనం హ్యాపీగా ఉంటామో, వారిని మాత్రమే ప్రేమించాలి. ప్రేమ వర్ణనాతీతం. ప్రేమంటేనే ఫీలింగ్స్. అది ఇద్దరి లో ఉన్నప్పుడు మాత్రమే బాగుంటుంది. ఒకరిలో మాత్రమే ఉంటే బాగోదు. ఇక విషయానికి వస్తే నాకు ఇప్పుడే పెళ్లి ఆలోచన లేదు. నాకు ఇంకా పెళ్ళి వయసు రాలేదని నా అభిప్రాయం. నేను ఎవరితో అయితే కంఫర్ట్ గా ఫీల్ అవుతానో వారిని పెళ్లి చేసుకుంటాను," అని చెప్పుకొచ్చింది రష్మిక.

admin1

admin1

Next Story