విజయ్ దేవరకొండ కుటుంబంతో రష్మిక మందన్న సంక్రాంతి సంబరాలు

దేవరకొండ కుటుంబంతో స్టార్ హీరోయిన్ సంక్రాంతి సెలబ్రేషన్స్

admin1
Updated on: 17 Jan 2022 9:00 PM IST
Rashmika Mandanna Sankranti Celebration with Vijay Devarakonda Family
X

దేవరకొండ కుటుంబంతో స్టార్ హీరోయిన్ సంక్రాంతి సెలబ్రేషన్స్

Rashmika Mandanna Sankranti Celebration: గీత గోవిందం మరియు డియర్ కామ్రేడ్ సినిమా లో తమ అద్భుతమైన కెమిస్ట్రీ దృష్టిని ఆకర్షించారు విజయ్ దేవరకొండ మరియు రష్మిక మందన్న. కన్నడ హీరో రక్షిత్ శెట్టి తో విడిపోయిన రష్మిక మందన్న విజయ్ దేవరకొండ తో పీకల్లోతు ప్రేమలో మునిగి తేలుతున్నట్టు ఎప్పటినుంచో వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి కానీ దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన మాత్రం ఇద్దరూ చేయటం లేదు. అయితే తాజాగా విజయ్ దేవరకొండ సోషల్ మీడియా లో సంక్రాంతి సందర్భంగా తన కుటుంబం తో తన ఇంట్లో దిగిన ఫోటో ని పెట్టారు.

ఆ తరువాత రష్మీక కూడా అలాంటి ఒక బ్యాక్ డ్రాప్ ఉన్న ఫోటో ని సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీంతో రష్మిక మందన్న విజయ్ దేవరకొండ ఇంట్లోనే ఉందని ఆమె విజయ్ దేవరకొండ కుటుంబం తో కలిసి సంక్రాంతి ని సెలబ్రేట్ చేసుకుంది అని కొందరు అన్నారు. గతంలో కూడా రష్మిక మందన విజయ్ దేవరకొండ కుటుంబంతో కలిసి వెళ్లి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ లో పాల్గొన్నట్లు పుకార్లు వినిపించాయి. అయితే వీరిద్దరూ మాత్రం ఈ పుకార్లపై మౌనం వహిస్తున్నారు. మరోవైపు ఇద్దరు తమ కెరీర్ లలో సూపర్ హిట్ లతో ముందుకు దూసుకుపోతూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు.

admin1

admin1

Next Story