భారీ రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తున్న రష్మిక.. ఏకంగా నాలుగు కోట్లు..?

Rashmika Mandanna: ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోయిన్లలో రష్మిక మందన్న కూడా ఒకరు.

Arun Chilukuri
Updated on: 6 Aug 2022 9:45 PM IST
Rashmika Mandanna Remuneration Touches Rs 4 Crore
X

భారీ రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తున్న రష్మిక.. ఏకంగా నాలుగు కోట్లు..?

Rashmika Mandanna: ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోయిన్లలో రష్మిక మందన్న కూడా ఒకరు. సరిలేరు నీకెవ్వరు, పుష్ప వంటి సూపర్ హిట్ సినిమాలతో కరియర్ లో ముందుకు దూసుకుపోతున్న రష్మిక ఇప్పుడు ఒక సినిమా కోసం కోటి రూపాయల దాకా రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తోంది. తాజాగా "పుష్ప" సినిమాకి కూడా అంతే డిమాండ్ చేసిన రష్మిక ఇప్పుడు తన రెమ్యూనరేషన్ ని మరింత పెంచినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.

మరోవైపు తెలుగు నిర్మాతలు సినిమా షూటింగులను బంద్ చేసిన సంగతి తెలిసిందే. స్ట్రైక్ చేయడానికి గల ముఖ్య కారణం హీరోలు, హీరోయిన్లు మరియు డైరెక్టర్లు అడుగుతున్న రెమ్యూనరేషన్ లే. ఆకాశాన్ని అంటుతున్న వారి రెమ్యూనరేషన్ లకు వ్యతిరేకంగా నిర్మాతలు ఈ బంద్ ని చేపట్టారు. ఈ నేపథ్యంలో రష్మిక మందన్నా కి ఇంత భారీ ఇంత భారీ రెమ్యూనరేషన్ ఎవరు ఇస్తారు అని సర్వత్ర ఆసక్తి నెలకొంది.

అయితే పుష్ప రెండవ భాగమైన "పుష్ప: ది రూల్" సినిమా కోసం నిర్మాతలు రష్మిక మందన్న కు ఏకంగా నాలుగు కోట్ల రెమ్యూనరేషన్ ఇచ్చినట్లుగా తెలుస్తుంది. ఇంకా తెలుగులో మాత్రమే కాక మరోవైపు మూడు నాలుగు బాలీవుడ్ సినిమాలలో కూడా బిజీగా ఉంది ఈ భామ. ఇంస్టాగ్రామ్ లో కూడా ఈమెకు బాగానే ఫాలోయింగ్ ఉంది. కానీ కీర్తి సురేష్ సాయి పల్లవి వంటి హీరోయిన్లు కూడా ఇంకా తక్కువ రెమ్యూనరేషన్ కి సినిమా చేస్తున్నప్పుడు ఇంత భారీ రెమ్యూనరేషన్ ఇచ్చి మరి రష్మిక మందన్న ను ఎవరు తీసుకుంటారు అని కూడా ఇప్పుడు డిస్కషన్లు జరుగుతున్నాయి.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story