Rashmika Mandanna: తనపై వస్తున్న నెగెటివిటీ పై రియాక్ట్ అయిన రష్మిక

Rashmika Mandanna: ట్రోల్స్ కి రియాక్ట్ అయిన రష్మిక మందన్న

Jyothi
Updated on: 8 Jan 2023 9:00 PM IST
Rashmika Mandanna Reacts to the Negativity Coming at Her
X

Rashmika Mandanna: తనపై వస్తున్న నెగెటివిటీ పై రియాక్ట్ అయిన రష్మిక

Rashmika Mandanna: నేషనల్ క్రష్ రష్మిక మందన్న పై గత కొంతకాలంగా సోషల్ మీడియాలో ఒక రేంజ్ లో ట్రోల్స్ వస్తున్న సంగతి తెలిసిందే. ఈమధ్య కాలంలో రష్మిక ఏం చేస్తున్నా కూడా అది వివాదం గానే మారుతుంది. "కాంతారా" సినిమా చూడలేదని చెప్పి కన్నడిగులకు పెద్ద టార్గెట్ గానే మారింది రష్మిక. దీంతో ఈమెకు వ్యతిరేకంగా ఎన్నో కథనాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తనపై వస్తున్న నెగెటివిటీ గురించి మాట్లాడింది రష్మిక. ఒక సెలబ్రిటీ అన్నాక ఇవన్నీ చాలా కామన్ అని తాను ఇలాంటివి పట్టించుకోని కొట్టిపారేసింది ఈ భామ. "మనం యాక్టర్స్ అయినప్పుడు మనల్ని అందరూ ఇష్టపడాలి అని మనం కోరుకోలేము. మనకి వ్యతిరేకంగా ద్వేషం కూడా ఉంటుంది. కానీ అలానే మన చుట్టూ ప్రేమ కూడా ఉంటుంది. మనం పబ్లిక్ ఫిగర్స్ కాబట్టి మన గురించి అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు.

కానీ మనం కేవలం మన చుట్టూ ఉన్న ప్రేమను మాత్రమే చూడాలి," అని చెప్పుకొచ్చింది రష్మిక. "కొంతమందికి నేను మాట్లాడే విధానం, నేను చేసే హ్యాండ్ జెస్చర్స్ కానీ నచ్చకపోవచ్చు. నన్ను ద్వేషించడానికి వారికి చాలా కారణాలు ఉండి ఉండొచ్చు. కానీ నా చుట్టూ చాలానే ప్రేమ కూడా ఉంది. దానికి నేనెప్పుడూ రుణపడి ఉంటాను," అని అంటుంది రష్మిక. ఇక సినిమాల పరంగా చూస్తే రష్మిక "పుష్ప: ది రూల్" తో బిజీగా ఉంది. అంతేకాకుండా రష్మిక చేతుల్లో రెండు బాలీవుడ్ సినిమాలు కూడా ఉన్నాయి.

Jyothi

Jyothi

Next Story