Rashmika Mandanna: కేవలం హీరో కోసమే సినిమా ఒప్పుకున్నాను..!

Rashmika Mandanna: కేవలం హీరో కోసమే సినిమా ఒప్పుకున్నాను..!

Arun Chilukuri
Updated on: 2 Feb 2023 8:30 PM IST
Rashmika Mandanna Reacts on Varisu Movie
X

Rashmika Mandanna: కేవలం హీరో కోసమే సినిమా ఒప్పుకున్నాను..

Rashmika Mandanna: పుష్ప వంటి ప్యాన్ ఇండియా సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న స్టార్ బ్యూటీ రష్మిక మందన్న ఆ తర్వాత మాత్రం అదే రేంజ్ లో సూపర్ హిట్ సినిమాలను అందుకోలేకపోయింది. బాలీవుడ్ నుంచి కూడా ఈమెకు బాగానే ఆఫర్లు వస్తున్నప్పటికీ అవి కమర్షియల్ గా మంచి విజయాలను సాధించలేకపోతున్నాయి. ఇక పుష్ప తర్వాత రష్మిక కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటించిన "వారీసూ" సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చింది.

ఈ సినిమాతో ఒక రష్మిక మంచి విజయాన్ని అందుకుంటుంది అని అందరూ అనుకున్నారు. కానీ సినిమాలో ఈమెకు పెద్ద చెప్పుకోదగ్గ పాత్ర దొరకలేదు. అసలు ఏమాత్రం ప్రాధాన్యత లేని అలాంటి పాత్రకు రష్మిక ఎలా ఓకే చెప్పిందా అని కూడా అభిమానులు షాక్ అయ్యారు. అయితే తాజాగా ఇప్పుడు ఈ విమర్శలపై స్పందించింది ఈ రష్మిక మందన్న.

సినిమా డైరెక్టర్ వంశీ పైడిపల్లి తనకు ముందుగానే కథను చెప్పారని, హీరోయిన్ పాత్ర రెండు పాటలు మరియు కొన్ని సన్నివేశాలకు మాత్రమే పరిమితం అని కూడా క్లారిటీ ఇచ్చారని కానీ విజయ్ వంటి సూపర్ స్టార్ పై ఉన్న అభిమానంతోనే తాను ఈ సినిమాకి ఓకే చెప్పానని స్పష్టం చేసింది రష్మిక. తనకు చిన్నప్పటి నుంచి విజయ్ అంటే ఎంతో అభిమానం అని అలాంటి హీరోతో నటించే అవకాశాన్ని ఎలా వదులుకుంటాను అని పేర్కొంది ఈ భామ. ఇక ప్రస్తుతం సినిమాల విషయానికి వస్తే రష్మిక రణబీర్ కపూర్ సరసన "యానిమల్", అల్లు అర్జున్ సరసన "పుష్ప 2" మరియు నితిన్ సరసన ఒక సినిమాలో నటిస్తోంది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story