Rashmika Mandanna: కష్టానికి అదృష్టం తోడైంది...

Rashmika Mandanna: దుల్కర్ సల్మాన్ మరియు మృణాల్ ఠాకూర్ హీరో హీరోయిన్లుగా నటించిన "సీతారామం" సినిమా..

Arun Chilukuri
Published on: 9 Aug 2022 4:09 PM IST
Rashmika Mandanna Reacts on the Success of Sita Ramam
X

Rashmika Mandanna: కష్టానికి అదృష్టం తోడైంది... 

Rashmika Mandanna: దుల్కర్ సల్మాన్ మరియు మృణాల్ ఠాకూర్ హీరో హీరోయిన్లుగా నటించిన "సీతారామం" సినిమా ఈ మధ్యనే విడుదలై బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచింది. హను రాఘవపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రష్మిక మందన్న ఆఫ్రిన్ అనే ఒక ముస్లిం యువతి పాత్రలో కనిపించి అందరి దృష్టిని ఆకర్షించింది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సినిమా సక్సెస్ గురించి రియాక్ట్ అయింది ఈ భామ.

"సీతారామం" సక్సెస్ తనకి చాలా సంతోషాన్ని ఇచ్చిందని ఈ సినిమా కోసం రెండేళ్ల పాటు చాలా కష్టపడ్డానని దానికి తగ్గ ఫలితం రావడం చాలా సంతోషంగా ఉందని చెప్పుకొచ్చింది రష్మిక. ఆఫ్రిన్ లాంటి పాత్ర ఇప్పటిదాకా తాను చేయలేదని ఇలాంటి విభిన్నమైన పాత్రలలో ఇంకా చేయాలని ఉందని చెప్పింది.

"హను రాఘవపూడి చాలా ప్యాషన్ ఉన్న డైరెక్టర్. అతనికి మరిన్ని గొప్ప విజయాలు రావాలని కోరుకుంటున్నాను. ఆయన పడ్డ కష్టానికి ఇప్పుడు ఫలితం దక్కింది. దానికి చాలా సంతోషంగా ఉంది" అని డైరెక్టర్ గురించి చెప్పినా రష్మిక పీరియాడికల్ సినిమా లేదా స్పోర్ట్స్ యాక్షన్ బయోపిక్ వంటి సినిమాలలో నటించాలని ఉందని చెప్పుకొచ్చింది. హిందీలో మొదటి సినిమా విడుదల కాకముందే మరొక మూడు ఆఫర్లు రావడం గురించి మాట్లాడుతూ తెలుగులో కూడా ఇలాగే జరిగిందని ఛలో సినిమా షూటింగ్లో ఉండగానే గీతాగోవిందం, దేవదాస్ సినిమాల అవకాశాలు వచ్చాయని చెప్పిన రష్మిక అదృష్టంతో పాటు హార్డ్ వర్క్ కూడా ముఖ్యమని అంటుంది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story