Rashmika Mandanna: రూమర్స్ పై రష్మిక షాకింగ్ రియాక్షన్..

Rashmika Mandanna: కన్నడలో "కిరిక్ పార్టీ" అనే సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన రష్మిక మందన్న..

Arun Chilukuri
Published on: 3 Aug 2022 2:29 PM IST
Rashmika Mandanna Opens Up About His Relationship Status
X

Rashmika Mandanna: రూమర్స్ పై రష్మిక షాకింగ్ రియాక్షన్..

Rashmika Mandanna: కన్నడలో "కిరిక్ పార్టీ" అనే సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన రష్మిక మందన్న నాగశౌర్య హీరోగా నటించిన "చలో" సినిమాతో తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయమైంది. మొదటి సినిమాతోనే మంచి హిట్ అందుకున్న ఈమె "గీత గోవిందం" సినిమాతో కరియర్ లోనే మర్చిపోలేని బ్లాక్ బస్టర్ అందుకుంది. ఆ తరువాత మహేష్ బాబు సరసన "సరిలేరు నీకెవ్వరు", అల్లు అర్జున్ సరసన "పుష్ప: ది రైజ్" సినిమాలతో బ్లాక్ బస్టర్లు అందుకుంది.

తాజాగా ఇప్పుడు బాలీవుడ్ లో అమితాబచ్చన్ హీరోగా నటిస్తున్న "గుడ్బయ్" అనే సినిమాలో కూడా ముఖ్యపాత్ర పోషిస్తూ బాలీవుడ్ లో సైతం అడుగుపెట్టబోతోంది ఈ భామ. తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన రిలేషన్షిప్ స్టేటస్ గురించి క్లారిటీ ఇచ్చింది రష్మిక. గత కొంతకాలంగా విజయ్ దేవరకొండ మరియు రష్మిక మందన్న పీకల్లోతు ప్రేమలో మునిగి తేలుతున్నారు అంటూ బోలెడు పుకార్లు వినిపించాయి.

కానీ తాజాగా "కాఫీ విత్ కరణ్" షో లో రష్మిక తనకు మంచి స్నేహితురాలు మాత్రమే అని చెప్పారు విజయ్ దేవరకొండ. తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నేను ఇంకా సింగిల్ అంటూ ధృవీకరించింది రష్మిక. తెలుగులో "పుష్ప: ది రూల్", "సీతారామం" సినిమాలతో బిజీగా ఉన్న రష్మీక "మిషన్ మజ్ను", "వారసుడు" సినిమాలతో కూడా బిజీగా ఉంది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story