Rashmika Mandanna: తమ జీవితాన్ని నియంత్రించద్దు అని తెగేసి చెప్పేసిన రష్మిక మందన్నా

Rashmika Mandanna on how her Family was Skeptical About her Becoming an Actor
x

Rashmika Mandanna: తమ జీవితాన్ని నియంత్రించద్దు అని తెగేసి చెప్పేసిన రష్మిక మందన్నా

Highlights

Rashmika Mandanna: "ఛలో" సినిమాతో టాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన కన్నడ బ్యూటీ రష్మిక మందన్నా.

Rashmika Mandanna: "ఛలో" సినిమాతో టాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన కన్నడ బ్యూటీ రష్మిక మందన్నా. కొంతకాలంలోనే స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న ఈమె "పుష్ప" చిత్రంతో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం పలు బడా ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్న ఈ భామ మరోవైపు బాలీవుడ్ లో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ప్రస్తుతం ఈమె "గుడ్ బై" అనే చిత్రంతో హిందీ లో కూడా ఎంట్రీ ఇచ్చింది.

వికాస్ బహల్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, నీనా గుప్తాలు ముఖ్య పాత్రలు పోషించారు. అక్టోబర్ 7న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది. తాజాగా చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా రష్మిక మందన్నా ఓ ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత విషయాలను కూడా పంచుకుంది. తన తల్లిదండ్రులకు సినీ ఇండస్ట్రీలో చాలా భిన్నమైన అభిప్రాయాలు కలిగి ఉన్నారట. మొదటి సారి సినిమాల్లోకి వెళ్ళడానికి నిర్ణయించుకున్నప్పుడు ఆమె ఆ ప్రపంచంలో ఎలా ఉండగలవు? అని అడిగారట.

"నన్ను నా స్వంత ఎంపికలను చేసుకోనివ్వండి. నా జీవితాన్ని నియంత్రించడానికి ప్రయత్నించవద్దు," అని ఆమె గట్టిగా చెప్పేసిందట. "వాళ్లు కంఫర్టబుల్ గా చెల్లి ని చూసుకుంటూ లైఫ్ ని హ్యాపీగా గడుపుతున్నారు. ఇక్కడ నేను ఒక నటిగా నా లైఫ్ ని లీడ్ చేస్తున్నాను. ఇది మా అందరికీ ఒక ప్రయాణం మరియు పాఠం లాంటిది కానీ కుటుంబంతో ఉండలేకపోతున్నందుకు చాలా బాధగా ఉంది" అని రష్మిక పేర్కొంది.

Show Full Article
Print Article
Next Story
More Stories