Rashmika Mandanna: విజ్జూ.. నువ్వు గర్వపడేలా చేస్తా..

Rashmika Mandanna Mysaa Movie Vijay Deverakonda Reaction
x

Rashmika Mandanna: విజ్జూ.. నువ్వు గర్వపడేలా చేస్తా..

Highlights

Vijay Deverakonda - Rashmika: తన భిన్నమైన కథల ఎంపికకు ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి రష్మిక మందన్న మరో సరికొత్త ప్రయోగానికి సిద్ధమయ్యారు.

Vijay Deverakonda - Rashmika: తన భిన్నమైన కథల ఎంపికకు ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి రష్మిక మందన్న మరో సరికొత్త ప్రయోగానికి సిద్ధమయ్యారు. ఆమె ప్రధాన పాత్రలో నటించనున్న ‘మైసా’ (Mysaa) అనే సినిమాను తాజాగా ప్రకటించారు. ఈ సినిమా ఫస్ట్ లుక్‌ పోస్టర్‌ అందరినీ ఆకట్టుకుంటోంది. పోస్టర్ చూసిన పలువురు సినీ ప్రముఖులు రష్మికకు అభినందనలు తెలియజేశారు.

అందులో ముఖ్యంగా నటుడు విజయ్‌ దేవరకొండ కూడా తన ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా ‘‘ఇది అద్భుతంగా ఉండబోతోంది’’ అంటూ ‘మైసా’ పోస్టర్‌ను షేర్ చేశారు. దీనిపై స్పందించిన రష్మిక, ‘‘విజ్జూ.. ఈ సినిమాతో నిన్ను గర్వపడేలా చేస్తానని మాట ఇస్తున్నా’’ అంటూ రిప్లై ఇచ్చారు. దీనితో విజయ్‌ను ఆమె 'విజ్జూ' అని ముద్దుగా పిలవడం సోషల్ మీడియాలో మరోసారి హాట్ టాపిక్‌గా మారింది.

ఇటీవల వీరిద్దరూ రిలేషన్‌షిప్‌లో ఉన్నారనే వార్తలు వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఇద్దరూ ఒకే కారులో ప్రయాణిస్తున్న వీడియోలు కూడా నెట్టింట వైరల్‌గా మారాయి.

అయితే ఇప్పుడు రష్మిక ‘మైసా’ అనే విభిన్నమైన కథతో ప్రేక్షకుల ముందుకొస్తుండగా, రవీంద్ర పుల్లె ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. రష్మిక కూడా ‘‘ఇంతకుముందు నేను చేయని పాత్ర, చూడని ప్రపంచం.. నాకు కొత్త రూపం’’ అంటూ సినిమా గురించి చెప్పుకొచ్చారు.

ఇదిలా ఉండగా, విజయ్ దేవరకొండ ‘కింగ్‌డమ్’ సినిమాతో బిజీగా ఉన్నారు. వీరి ఇద్దరి కాంబినేషన్‌లో సినిమాకంటే బయట ఇలా పరస్పర స్పందనలు వస్తుండటంతో, అభిమానుల ఆసక్తి మరింత పెరిగింది.

Show Full Article
Print Article
Next Story
More Stories