Rashmika: విజయ్ కోసం రష్మీకా ని రంగంలోకి దింపనున్న వంశీ పైడిపల్లి

Rashmika Mandanna May Act as a Heroine in Thalapathy Vijay and Vamshi Paidipally New Movie Project
x

 విజయ్ కోసం రష్మీకా ని రంగంలోకి దింపనున్న వంశీ పైడిపల్లి (ఫైల్ ఫోటో)

Highlights

Rashmika Mandanna - Thalapathy Vijay New Movie: రష్మిక మందన ను హీరోయిన్ గా అనుకుంటున్న వంశీ పైడిపల్లి

Rashmika Mandanna - Thalapathy Vijay New Movie: కోలీవుడ్ స్టార్ హీరో తళపతి విజయ్ త్వరలోనే టాలీవుడ్ డైరెక్టర్ వంశీ పైడిపల్లితో కలిసి చేస్తున్న సంగతి తెలిసిందే. దీని గురించి అధికారిక ప్రకటన త్వరలో విడుదల కాబోతోంది. ఇప్పటికే సినిమా ను ప్రకటించి చాలా రోజులు అయింది కానీ తాజాగా ఈ సినిమా గురించిన ఒక ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర కోసం స్టార్ బ్యూటీ రష్మిక మందన్న అనుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో హీరోయిన్ కోసం వంశీ పైడిపల్లి ఒక స్ట్రాంగ్ పాత్రని రాసుకున్నాడట.

ఆ పాత్రలో రష్మిక మందన్నా అయితే చాలా బాగా నటిస్తుందని ఆ పాత్రకి పూర్తి స్థాయిలో న్యాయం చేయగలదని వంశీ పైడిపల్లి అనుకున్నారట. దీంతో ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర కోసం రష్మిక మందన్న ను సంప్రదించారు దర్శకనిర్మాతలు. అయితే ఈ భామ ఇంకా ఈ సినిమా గ్రీన్ సిగ్నల్ ఇవ్వాల్సి ఉంది. చిత్ర షూటింగ్ వచ్చే ఏడాది షూటింగ్ సెట్స్ పైకి వెళ్లబోతోంది. మరోవైపు రష్మిక మందన్న హీరోయిన్ గా అల్లు అర్జున్ సరసన నటించిన "పుష్ప: ది రైజ్" సినిమా డిసెంబర్ 17న విడుదలకు సిద్ధంగా ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories