Rashmika Mandanna: నెగిటివ్ ఫీలింగ్స్ వద్దు.. జీవితం చాలా చిన్నది..

* నెగిటివ్ ఫీలింగ్స్ వద్దు అంటున్న స్టార్ హీరోయిన్

Dhatripriya
Updated on: 9 Feb 2023 5:00 PM IST
Rashmika Mandanna Is Attracting Everyone Attention With Her Good Quotation
X

మంచి కొటేషన్ తో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న రష్మిక మందన్న

Rashmika Mandanna: ఒకవైపు తెలుగులో మాత్రమే కాక మరొకవైపు బాలీవుడ్ లో కూడా తనదైన శైలిలో అందరినీ ఆకట్టుకుంటూ కెరియర్లో ముందుకు దూసుకుపోతున్న స్టార్ బ్యూటీ రష్మిక మందన్న తాజాగా ఇప్పుడు ఒక మంచి కొటేషన్ చెబుతోంది. "అందరూ సంతోషంగా ఉండండి. ఆశతో జీవించండి. సంతోషం మరియు శాంతి జీవితంలో అన్నిటికంటే చాలా ఎక్కువ. ప్రతికూల భావాలను వదిలేయాలి ఎందుకంటే జీవితం చాలా చిన్నది," అని అంటుంది నేషనల్ క్రష్ రష్మిక మందన్న.

ఇక రష్మిక పెట్టిన కొటేషన్ తో పాటు ఆమె షేర్ చేసిన ఫోటో కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతుంది. థై స్లిట్ డిజైనర్ డ్రెస్ తో తన అల్ట్రా స్టైలిష్ లుక్కుతో రష్మిక మనసులను కొల్లగొడుతోంది. ప్రస్తుతం రష్మిక మందన్న వరుస సినిమాలతో బిజీగా ఉంది. ముఖ్యంగా రష్మిక స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సరసన హీరోయిన్ గా "పుష్ప: ది రూల్" సినిమా షూటింగ్ తో బిజీగా ఉంది. ఈ సినిమాలో శ్రీవల్లి అనే ఒక పల్లెటూరి అమ్మాయి పాత్రలో రష్మిక కనిపించనుంది. ఇక ఈ మధ్యనే రష్మిక మందన్న కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సరసన వారీసు సినిమాలో నటించింది.

ఈ మధ్యనే బాలీవుడ్ లో కూడా సిద్ధార్థ మల్హోత్రా సరసన మిషన్ మజ్ను సినిమాలో అంధూరాలిగా నటించి అందరి దృష్టిని ఆకర్షించింది. ఇక త్వరలోనే బాలీవుడ్ లో స్టార్ హీరో రణబీర్ కపూర్ సరసన సందీప్ వంగా దర్శకత్వంలో "యానిమల్" అనే సినిమాలో కూడా నటించడానికి సిద్ధమవుతోంది రష్మిక.


Dhatripriya

Dhatripriya

Next Story