Rashmika Mandanna: బాగా స్లో అయిపోయిన నేషనల్ క్రష్ కెరియర్

Rashmika Mandanna: బాగా స్లో అయిపోయిన నేషనల్ క్రష్ కరియర్

Jyothi
Updated on: 10 March 2023 8:30 PM IST
Rashmika Mandanna has kept all her hopes on the Next Film
X

Rashmika Mandanna: నెక్స్ట్ సినిమాలో పైనే ఆశలన్నీ పెట్టుకున్న రష్మిక

Rashmika Mandanna: "ఛలో" సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన కన్నడ బ్యూటీ రష్మిక మందన్న చేసింది కొన్ని సినిమాలే అయినప్పటికీ వరుసగా బ్లాక్ బస్టర్లు అందుకుంటూ ఇప్పుడు స్టార్ హీరోయిన్గా మారిపోయింది. తమిళ్, తెలుగు మరియు హిందీ భాషల్లో వరుస సినిమాలతో బిజీగా ఉన్న రష్మిక నేషనల్ క్రష్ గా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. కానీ గత కొద్ది రోజులుగా రష్మిక స్పీడ్ బాగా తగ్గిపోయిందని చెప్పుకోవచ్చు.

"పుష్ప: ది రైజ్" సినిమా బ్లాక్ బస్టర్ అయినప్పటికీ ఆ సినిమా తర్వాత రష్మిక నటించిన చాలా వరకు సినిమాలు పెద్దగా ప్రేక్షకులను అలరించ లేకపోయాయి. "ఆడవాళ్లు మీకు జోహార్లు" సినిమాతో ఫ్లాప్ అందుకున్న రష్మిక "సీతారామం" సినిమాలో కీలక పాత్రలో మాత్రమే కనిపించింది. ఇక అమితాబచ్చన్ సినిమా "గుడ్ బై" తో హిందీ లో కూడా అడుగుపెట్టిన రష్మిక తలపతి విజయ్ హీరోగా నటించిన "వారీసు" సినిమా తో కూడా తమిళ్ ప్రేక్షకులను పలకరించింది. కానీ ఈ రెండు సినిమాలు కూడా రష్మికకి అంతగా ఉపయోగపడలేకపోయాయి అని చెప్పుకోవచ్చు.

ఆ తర్వాత నెట్ ఫ్లెక్స్ లో విడుదలైన "మిషన్ మజ్ను" కూడా ప్రేక్షకుల నుంచి యావరేజ్ రెస్పాన్స్ ను మాత్రమే అందుకుంది. తాజాగా ఇప్పుడు తన ఆశలన్నీ రష్మిక మందన్న "పుష్ప: ది రూల్" పైన పెట్టుకుంది. బాలీవుడ్ లో రన్బీర్ కపూర్ నటిస్తున్న "యానిమల్" సినిమాలో కూడా రష్మిక హీరోయిన్గా నటిస్తోంది. సందీప్ వంగా ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. మరి ఈ సినిమాలతో రష్మిక ఎంతవరకు మంచి విజయాలు అందుకుంటుందో వేచి చూడాలి.

Jyothi

Jyothi

Next Story