అందువల్లే ఆ సినిమాని చేయలేకపోతున్నా: రష్మిక మందన్నా

అందువల్లే ఆ సినిమాని చేయలేకపోతున్నా: రష్మిక మందన్నా
x
రష్మిక మందాన
Highlights

సౌత్ ఇండియన్ హీరోయిన్స్ లో రష్మిక ఒకరు.. ఛలో సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకి పరిచయం అయిన ఈ భామ గీతా గోవిందం సినిమాతో మంచి పేరును సంపాదించుకుంది.

సౌత్ ఇండియన్ హీరోయిన్స్ లో రష్మిక ఒకరు.. ఛలో సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకి పరిచయం అయిన ఈ భామ గీతా గోవిందం సినిమాతో మంచి పేరును సంపాదించుకుంది. ఈ సినిమా మంచి హిట్టు కావడంతో వరుస సినిమా ఆఫర్స్ వస్తున్నాయి ఈ భామకి .. ప్రస్తుతం మహేష్ బాబుతో సరిలేరు నీకెవ్వరు, అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్లో వస్తున్నసినిమా, నితిన్ భీష్మలో నటిస్తుంది రష్మిక..

ఇది ఇలా ఉంటే తెలుగులో బ్లాక్ బస్టర్ విజయం అందుకున్న 'జెర్సీ' సినిమాను హిందీలో రీమేక్ చేస్తు్న్న సంగతి తెలిసిందే. ఇందులో బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్ హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్‌గా రష్మిక మందనను ఎంపిక చేసుకోవాలనుకుంది చిత్రబృందం. కానీ రష్మిక నో చెప్పింది. దీనికి గల కారణం సినిమాకు గాను ఎక్కువ పారితోషికం అడగటమేనని వార్తలు వచ్చాయి.

అయితే దీనిపైన అసలు కారణాన్నివెల్లడించింది రష్మిక " సినిమాలో తన పాత్రకు న్యాయం చేయలేనేమో అన్న భయంతో ఈ సినిమాకు నో చెప్పనని, నేను ఓ సినిమాలో నటిస్తున్నానంటే.. నా క్రియేటివిటీని మొత్తం సినిమాలోనే పెట్టాలి. నాకు అంత స్కోప్ లేనప్పుడు నేను సినిమాకు ఒప్పుకోను. జెర్సీ సినిమా ఓ గొప్ప సినిమా, ఎవరైనా చేస్తారు. కానీ నేను సెట్‌కు వచ్చి అలసిపోలేను. జెర్సీ రీమేక్ టీంకు ఇంతకంటే ఎక్కువ దక్కాలి. ఎవరైతే బాగా ఎనర్జిటిక్‌గా ఉంటారో వారు ఈ సినిమాలో నటించగలుగుతారు. సినిమాకి డబ్బు ముఖ్యం కాదు. ఎంత కష్టపడుతున్నాం అన్నది ముఖ్యం అని చెప్పుకొచ్చింది ఈ భామ.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories