Rashmika Mandanna: అవకాశం వస్తే... ఆ హీరోతోనే డేటింగ్ చేస్తా!

Rashmika Mandanna: ప్రస్తుతం బిజీగా ఉన్న హీరోయిన్లలో రష్మిక మందన్నా ఒకరు.

Venkata Chari
Updated on: 27 May 2021 11:01 PM IST
Rashmika Mandanna Dating With Prabhas
X

రష్మిక మందన్నా (ఫొటో ట్విట్టర్)

Rashmika Mandanna: ప్రస్తుతం బిజీగా ఉన్న హీరోయిన్లలో రష్మిక మందన్నా ఒకరు. ఛలో సినిమాతో టాలీవుడ్ గడప తొక్కి స్టార్ హీరోయిన్‌గా ఎదిగి, స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూ.. దూసుకపోతోంది రష్మికా. తాజాగా 'సుల్తాన్' సినిమాతో తమిళ ప్రేక్షకులకు చేరువైంది. సినిమా బోల్తాకొట్టినా.. రష్మికా మాత్రం ఫుల్ మార్కులు కొట్టేసింది.

ఇటీవల జరిగిన ఓ ఇంటర్వ్యూలో ఎన్నో ఆసక్తికర విషయాలను పంచుకుంది ఈ కన్నడ బ్యూటీ. ఒకవేళ డేట్‌కి వెళ్లే ఛాన్స్ వస్తే... పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో ఒకరోజు డేట్‌కి వెళ్లాలని ఉందని మనసులోని మాటను వెల్లడించింది. రెబల్ స్టార్ అంటే చాలా ఇష్టమని, ఆయనకు పెద్ద ఫ్యాన్‌ ని అంటూ అసలు విషయం చెప్పుకొచ్చింది.

ప్రస్తుతం 'పుష్ప' సినిమాలో అల్లు అర్జున్ సరసన నటిస్తోంది రష్మికా. సుకుమార్ రూపొందిస్తున్న ఈ సినిమాలో పల్లెటూరి యువతిగా డిఫరెంట్ లుక్‌లో ఆకట్టుకోనుందట.

Venkata Chari

Venkata Chari

Next Story