Rashmika Mandanna: పుష్ప కోసం నల్లగా మారిన రష్మిక

Rashmika Mandanna: రష్మిక రంగు కోసం కష్టపడుతున్న పుష్ప బృందం

admin1
Updated on: 16 Nov 2021 4:58 PM IST
Rashmika Mandanna Changed into Black Color for Pushpa
X

రష్మిక మందన్న (ఫైల్ ఇమేజ్)

Rashmika Mandanna: స్టార్ హీరోయిన్ల ను పల్లెటూరి అమ్మాయిలాగా చూపించడం అంటే అంత తేలిక కాదు. "రంగస్థలం" సినిమాలో సమంత "కొండపొలం" సినిమాలో రకుల్ ప్రీత్ తదితరులను పల్లెటూరి అమ్మాయిల గా మార్చడానికి చిత్ర బృందం చాలా కష్టపడింది. మంచి రంగు ఉన్న హీరోయిన్లని చామనఛాయ రంగు లోకి మార్చడం కొంచెం కష్టమైన పనే. ఈ నేపథ్యంలోనే 'పుష్ప' సినిమా కోసం రష్మిక మందన్న ను పల్లెటూరి అమ్మాయి గా చూపించడానికి చిత్ర బృందం చాలా కష్టపడుతునట్లు తెలుస్తోంది. అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రాబోతున్న "పుష్ప" సినిమాలో శ్రీ వల్లి అనే ఒక పల్లెటూరి అమ్మాయి పాత్రలో కనిపించబోతున్న సంగతి తెలిసిందే

ఈ సినిమా కోసం మేకప్ ద్వారా రష్మీక ని చామనఛాయ రంగు లోకి మారుస్తారు. దీన్నే రష్మిక ఒక ఫోటో ద్వారా రివీల్ చేసింది. తన చేతిని ఫోటో తీసి సోషల్ మీడియాలో పెట్టింది రష్మిక. అందులో మణికట్టు వరకు నల్లగా ఉన్న చెయ్యి పైభాగం మాత్రం తెల్లగా ఉంది. "పుష్ప" లంచ్ బ్రేక్ ఇలా ఉంటుంది అని చెప్పుకొచ్చింది రష్మిక. అంటే ఆమె ఒంటి మొత్తానికి నలుపురంగు పూసారని, కేవలం తినడానికి మాత్రమే చేతిని కడుక్కుని తింటుందని రష్మిక చెప్పాలనుకుంది. ఇక అనసూయ, సునీల్, ఫహాద్ ఫాజిల్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ సినిమా ఈ ఏడాది డిసెంబర్ 17న థియేటర్లలో విడుదలకు సిద్ధం అవుతున్న సంగతి తెలిసిందే.

admin1

admin1

Next Story