ICON Movie: వరుసగా ఆమెతోనే సినిమాలు చేస్తున్న అల్లు అర్జున్

ICON Movie: ప్రస్తుతం "పుష్ప" సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్న అల్లుఅర్జున్ త్వరలోనే తన తదుపరి చిత్రం అయిన "ఐకాన్" ని సెట్స్పైకి తీసుకెళ్లనున్నారు.

admin1
Published on: 10 Aug 2021 3:27 PM IST
Rashmika Mandanna and Pooja Hegde in Allu Arjun ICON Movie
X

ICON Movie: వరుసగా ఆమెతోనే సినిమాలు చేస్తున్న అల్లు అర్జున్

ICON Movie: ప్రస్తుతం "పుష్ప" సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్న అల్లుఅర్జున్ త్వరలోనే తన తదుపరి చిత్రం అయిన "ఐకాన్" ని సెట్స్పైకి తీసుకెళ్లనున్నారు. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో అల్లు అర్జున్ కోసం ఇద్దరు హీరోయిన్లు ఉండబోతున్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలోని ఇద్దరు హీరోయిన్ల పాత్రల కోసం దర్శకనిర్మాతలు రష్మిక మందన్న మరియు పూజా హెగ్డే లను సంప్రదించడానికి ప్రయత్నిస్తున్నారని తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇంకా వెలువడాల్సి ఉంది. వారిద్దరూ కనుక ఈ సినిమాలో నటించడానికి ఓకే చెప్తే అది వారికి అల్లుఅర్జున్ తో మూడవ సినిమా అవుతుంది.

"డీజే" మరియు "అల వైకుంఠ పురములో" సినిమా లతో లో అల్లు అర్జున్ సరసన నటించిన పూజా హెగ్డే కి బన్నీ తో ఇది మూడవ చిత్రం కాబోతోంది. అలానే 'పుష్ప 1" మరియు "పుష్ప 2" సినిమాలలో రష్మిక మందన అల్లు అర్జున్ భార్య గా కనిపిస్తున్న సంగతి తెలిసిందే. "ఐకాన్" లో కూడా ఈమె హీరోయిన్ గా మారితే ఈ సినిమా ఆమెకు అల్లు అర్జున్ తో మూడో సినిమా అవుతుంది. ఇక "పుష్ప 1", "ఐకాన్" మరియు "పుష్ప 2" షూటింగ్స్ ఒకదాని తర్వాత ఒకటి జరగనున్నాయి. ఈ నేపథ్యంలో రష్మిక మందన తో అల్లు అర్జున్ వరుసగా సినిమాలు తీసినట్లే చెప్పుకోవాలి.

admin1

admin1

Next Story