'గీతా ఛలో' అనబోతున్న రష్మికా మందన్న

Ruthvik
Published on: 13 April 2019 9:59 PM IST
గీతా ఛలో అనబోతున్న రష్మికా మందన్న
X

కన్నడ లో హీరోయిన్ గా మంచి పేరు తెచ్చుకున్న రష్మిక మందన్న తెలుగులో వెంకీ కుడుముల దర్శకత్వంలో 'ఛలో' అనే సినిమాతో హీరోయిన్ గా మారింది. మొదటి సినిమాతోనే హిట్ అందుకున్న తరువాత 'గీతగోవిందం' సినిమాలో విజయ్ దేవరకొండ సరసన నటించింది. ఈ సినిమా ఏకంగా బ్లాక్ బస్టర్ గా మారిన సంగతి తెలిసిందే. ఇక ప్రస్తుతం క్రేజ్ ఉన్న హీరోయిన్లలో ఒకరిగా మంచి పేరు తెచ్చుకుంది రష్మిక మందన్న. ప్రస్తుతం టాలీవుడ్ నుండి ఈమెకు బోలెడు మంచి ఆఫర్లు వస్తున్న సంగతి తెలిసిందే.

తాజాగా రష్మిక మందన్న నటించిన కన్నడ సినిమా ఒకటి తెలుగులో డబ్బింగ్ కానుంది. 2017 లో గణేష్ మరియు రష్మిక మందన్న హీరోహీరోయిన్లుగా 'చమక్' అనే సినిమాలో నటించారు. కన్నడలో సూపర్ హిట్ అయిన ఈ చిత్రం ఇప్పుడు తెలుగులో విడుదల కాబోతోంది. ఈ సినిమా కోసం రష్మిక మందన్న గీత గోవిందం,చలో టైటిల్స్ ను కలగలిపి 'గీత ఛలో' అనే సరికొత్త టైటిల్ ని పెట్టారు. పెళ్లి తర్వాత విడాకుల దాకా వెళ్ళిన ఓ జంట కథ ఇది. జూడా శాండీ ఈ సినిమాకు సంగీతాన్ని అందించగా, సుని దర్శకత్వం వహించారు. కన్నడలో సూపర్ హిట్ అయిన ఈ సినిమా తెలుగులో ఎంత వరకు ప్రేక్షకులను మెప్పిస్తుందో వేచి చూడాలి.

Ruthvik

Ruthvik

Next Story