ఆలియా భట్ స్థానంలో రష్మిక మందన్న

JR NTR: ఎన్టీఆర్ తో రొమాన్స్ చేయనున్న రష్మిక
x

ఆలియా భట్ స్థానంలో రష్మిక మందన్న

Highlights

JR NTR: ఎన్టీఆర్ తో రొమాన్స్ చేయనున్న రష్మిక

JR NTR: యంగ్ టైగర్ ఎన్టీఆర్ "ఆర్ఆర్ఆర్" సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్నారు. ఇక తాజాగా తన తదుపరి సినిమా స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో చేసేందుకు సిద్ధమవుతున్నారు. గత కొంత కాలంగా బాలీవుడ్ బ్యూటీ అలియాభట్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుందని వార్తలు వినిపించాయి. ఆర్ఆర్ఆర్ లో రామ్ చరణ్ సరసన హీరోయిన్ గా నటించిన ఆలియా ఎన్టీఆర్ తో కూడా నటిస్తున్నట్లుగా ఒక ప్రమోషనల్ ఇంటర్వ్యూలో హింట్ ఇచ్చింది. కానీ తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది.

అయితే దీని కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. మరోవైపు ఆలియా స్థానంలో ఇప్పుడు దర్శక నిర్మాతలు రష్మీక మందన్న ను తీసుకున్నట్టు తెలుస్తోంది. ప్యాన్ ఇండియన్ సినిమా కాబట్టి ప్యాన్ ఇండియా పేరున్న హీరోయిన్ అయితే బాగుంటుందని "పుష్ప" సినిమాతో ప్యాన్ ఇండియన్ మార్కెట్ కి పరిచయమైన రష్మిక ఇప్పటి దాకా ఎన్టీఆర్తో జతకట్ట లేదు కూడా. కాబట్టి వీరిద్దరి కెమిస్ట్రీ ఫ్రెష్ గా ఉంటుందని అనుకున్న దర్శకనిర్మాతలు రష్మిక ను సంప్రదించగా ఆమె కూడా ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ జూన్ నుంచి సెట్స్ పైకి వెళ్లనుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories