Rashmika: అవి నిజమైతే బాగుండు

Rashmika: తెలుగు ఇండస్ట్రీలో చాలా తక్కువ సమయంలో స్టార్ హీరోయిన్ గా పేరు సంసాదించుకుంది రష్మిక మందన్న

Venkata Chari
Updated on: 20 Feb 2021 5:00 PM IST
Rashmika Comments on her Remuneration
X

రష్మిక ఫైల్ ఫోటో

Tollywood News: తెలుగు ఇండస్ట్రీలో చాలా తక్కువ సమయంలో స్టార్ హీరోయిన్ గా పేరు సంసాదించుకుంది రష్మిక మందన్న. కన్నడ చిత్రం కిరాక్కు పార్టీ అనే సినిమా ద్వార హీరోయిన్ గా పరిచమైంది. టాలీవుడ్ లో నటించిన తొలి చిత్రం ఛలో సక్సెస్ ను అందిస్తే, ఆ తరువాత విజయ్‌దేవరకొండతో చేసిన గీతగోవిందం సంచలన విజయాన్ని అందించింది. అనంతరం ఈ ముద్దుగుమ్మ వెనక్కితిరిగి చూసుకోలేదు. వరుస విజయాలతో స్టార్‌ హీరోల సరసన నటించే అవకాశాలను సొంతం చేసుకుంటుంది. తెలుగు, కన్నడ భాషా చిత్రాల్లో సత్తా చాటిన ఈ అమ్మడు.. ఇటీవల బాలీవుడ్‌లోకి కూడా ప్రవేశించింది.

అయితే ఈ కన్నడ బ్యూటికి సంబధించిన ఓ వార్త బాలీవుడ్‌లో చక్కర్లు కొడుతోంది. తను బాలీవుడ్‌ సినిమా కోసం ఏకంగా రెండు కోట్ల రూపాయల రెమ్యునరేషన్‌ తీసుకోబోతోందనదే ఆ వార్త సారాంశం. వీటిపై తాజాగా ఓ ఇంటర్వ్యూలో రష్మిక స్పందించింది. ఆమె మాట్లాడుతూ.. 'నేను భారీగా రెమ్యునరేషన్‌ తీసుకుంటున్నాననే వార్తలు వస్తున్నాయి. అంత రెమ్యునరేషనా..? ఈ మాటలు నిజమైతే బాగుండేది. ఆ వార్తల్లో వస్తున్నట్లు అంత మొత్తం రెమ్యునరేషన్‌ అందుకోవాలన్నదే నా కల' అంటూ కోట్టిపారేసింది. ప్రస్తుతం రష్మిక తెలుగులో అల్లు అర్జున్ తో క‌లిసి 'పుష్ప‌', శ‌ర్వానంద్‌తో 'ఆడాళ్లు మీకు జోహార్లు ' అనే సినిమాతో పాటు రెండు హిందీ సినిమాల్లో నటిస్తోంది.

Venkata Chari

Venkata Chari

Next Story